Begin typing your search above and press return to search.

తెలంగాణలో మరో న్యూస్‌ పేపర్‌!

By:  Tupaki Desk   |   8 April 2015 7:24 AM GMT
తెలంగాణలో మరో న్యూస్‌ పేపర్‌!
X
తెలంగాణవాదాన్ని ప్రతిబింబించేలా కొత్త న్యూస్‌ పేపర్‌ పెద్ద ఎత్తున తెలంగాణలో రానుందా? నమస్తే తెలంగాణ మాజీ యజమాని సీఎల్‌ రాజం ఇందుకు కసరత్తు చేస్తున్నారా? ఈ చర్చలు ఇపుడు తెలంగాణలోని జర్నలిస్టు, రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశం అవుతున్నాయి.

నమస్తే తెలంగాణ ఆర్థిక ఇక్కట్లలో ఉన్నప్పటికీ మెజార్టీ వాటాదారుడు అయిన సీఎల్‌ రాజం పత్రికను నడిపించారు. అయితే అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ వాటాలను కేసీఆర్‌ కు బదలాయించారు. ఈ విషయంలో అనేక రకలా పుకార్లు చెలామణిలోకి వచ్చాయి. ఇటీవలే కేసీఆర్‌ తెలంగాణలో కొత్త ఇంగ్లీష్‌ డైలీని తీసుకురావాలని నిర్ణయించినట్లు, ఇందుకు తగ్గట్లు కసరత్తు కూడా చేస్తున్నట్లు వార్తలు వచ్చాయి.

ఈ నేపథ్యంలో గతంలోనే పత్రిక నడిపిన అనుభవం ఉన్న రాజం తెలుగు పత్రికను తెచ్చేందుకు సిద్దం అవుతున్నట్లు సమాచారం. ఈ మేరకు పత్రిక కోసం రెండు మూడు పేర్లు ప్రతిపాదనలో ఉన్నట్లు తెలుస్తోంది. ''ప్రజా తెలంగాణ'' అనే పేరు ఇందులో ప్రముఖంగా వినిపిస్తోంది. తెలంగాణలోని అన్ని పక్షాల వాణిని వినిపించేలా ఈ పత్రిక ఉండేలా కసరత్తు సాగుతోంది. మరోవైపు రాజంకు బీజేపీ సైతం మద్దతు ఇచ్చే అవకాశాలు ఉన్నట్లు సమాచారం.

రాష్ట్రంలో అన్నిపార్టీలకు చానెల్లు, పేపర్ల మద్దతు ఉన్నపపటికీ ఇప్పటివరకు ఏ సపోర్టు లేని పార్టీ ఒక్క బీజేపీనే. దీంతో న్యూస్‌ పేపర్‌ పరిశ్రమతో అనుబంధం కలిగిన బీజేపీ నాయకుడైన రాజంకు ఆ పార్టీ మద్దతు ఇవ్వవచ్చని అంటున్నారు.