Begin typing your search above and press return to search.
ఏపీలో పాక్షిక లాక్ డౌన్..క్లారిటీ ఇచ్చిన అధికారులు!
By: Tupaki Desk | 8 Jan 2022 4:43 AM GMTఆంధ్రప్రదేశ్ లో పాక్షిక లాక్ డౌన్ అంటూ జరుగుతున్న ప్రచారంపై అధికారులు స్పందించారు. దీనిపై క్లారిటీ ఇచ్చారు. పాక్షిక లాక్ డౌన్ అంటూ వస్తున్న ప్రచారాన్ని నమ్మవద్దని అధికారులు తెలిపారు. ఇప్పటివరకూ ఏపీలో ఎలాంటి నైట్ కర్ఫ్యూ, ఆంక్షలు విధించలేదని స్పష్టం చేశారు. తప్పుడు ప్రచారం చేసే వారిపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
ఆంధ్రప్రదేశ్ లో ఈ నెల 8 నుంచి (ఈరోజు) రాత్రి 10 గంటల నుంచి 5 గంటల వరకూ నైట్ కర్ఫ్యూ.. దుకాణాలు సాయంత్రం 7 గంటలకే మూసివేయాలంటూ.. 50శాతం ఆక్యూపెన్సీతో బార్లు, రెస్టారెంట్లు, పబ్ లు, సినిమా థియేటర్లపై ఆంక్షలు విధిస్తారని ఒక డిటెయిల్డ్ న్యూస్ సోషల్ మీడియాలో నిన్నటివరకూ జోరుగా ప్రచారం సాగింది. దీన్ని నమ్మి మీడియా కూడా ఆంధ్రాలో 8వ తేదీ నుంచి ఆంక్షలు అని హోరెత్తించాయి. ఈ మేరకు సోషల్ మీడియాలో ప్రచారం చేశారు. ఈ ప్రచారం ముఖ్యంగా సంక్రాంతి బరిలో ఉన్న చిత్రాల గుండెల్లో గుబులు పుట్టించింది.
అయితే మరోసారి ఈ ఆంక్షలు పెట్టి అన్నింటిని ఆర్థిక విపత్తులోకి దిగజార్చడం ఆమోద యోగ్యం కాదని ఏపీ ప్రభుత్వం భావిస్తున్నట్టు తెలిసింది. ఏపీలోనూ జగన్ ముందు నుంచి ఆంక్షలపై ఆచీతూచీగానే వ్యవహరిస్తున్నారు. ఇక తాజాగా ఏపీలో ఆంక్షలకు అవకాశమే లేదని ఏపీ ఆరోగ్యశాఖ వివరణ ఇచ్చింది.
ఈ క్రమంలోనే ఏపీలో అసలు 8 నుంచి నైట్ కర్ఫ్యూ, 50శాతం ఆక్యూపెన్సీ అనేది లేదని తేలిపోయింది. ఎందుకంటే ఈరోజు ఏపీ ప్రభుత్వం నుంచి దీనిపై అధికారికంగా ఎటువంటి ప్రకటన రాలేదు. సో ఆంక్షలు ఇప్పటికిప్పుడు లేవని తేలిపోయింది.. కేసులు పెరిగితే అప్పటి పరిస్థితి ఎలా ఉంటుందో తెలియదు.
సోషల్ మీడియాలో జరిగిన ఏపీలో నైట్ కర్ఫ్యూ, 50శాతం ఆక్యూపెన్సీ ఫేక్ న్యూస్ అని తేలిపోయింది. ఈ సంక్రాంతి బరిలో ఇప్పటికే కొన్ని సినిమాలున్నాయి. అవి ప్రచారాన్ని హోరెత్తిస్తున్నాయి. ఇప్పుడు ఈ ఆంక్షల భయాలతో ఆ సినిమా యూనిట్లు కంగారుపడుతున్నాయి. కానీ అలాంటిది ఏమీ లేదని ఈరోజు తేలడంతో సంక్రాంతి సినిమాలకు వచ్చిన ఢోకా ఏమీ లేదని సమాచారం. ఆంక్షలు పెట్టే ఉద్దేశం ఏపీ ప్రభుత్వానికి ప్రస్తుతానికి లేదని తెలుస్తోంది.