Begin typing your search above and press return to search.
బాలయ్య కి బాబు ఇచ్చేశాడు!
By: Tupaki Desk | 7 March 2019 7:28 AM GMTవచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో సినీ నటుడు - టీడీపీ సీనియర్ నేత బాలకృష్ణ ఎక్కడి నుంచి పోటీ చేస్తారనే అంశంపై చాన్నాళ్లుగా నెలకొన్న ఉత్కంఠ దాదాపుగా తొలగిపోయినట్లే! తన సిట్టింగ్ స్థానం హిందూపురం నుంచే ఆయన పోటీ చేస్తారని దాదాపుగా క్లారిటీ వచ్చేసింది. నియోజకవర్గంలో బాలయ్య తాజా పర్యటనతో ఆయన పోటీపై క్లారిటీ వచ్చేసినట్లయింది.
అనంతపురం జిల్లా హిందూపురం టీడీపీకి కంచుకోట. గత ఎన్నికల్లో బాలయ్య ఇక్కడి నుంచి పోటీ చేసి విజయం సాధించారు. అయితే - వచ్చే ఎన్నికల్లో బాలయ్య తిరిగి హిందూపురం నుంచి పోటీ చేయబోరని పలు ఊహాగానాలు వెలువడ్డాయి. అందుకు కారణం టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఈ దఫా అనంతపురం జిల్లా నుంచి అసెంబ్లీ ఎన్నికల బరిలో ఉంటారన్న ప్రచారం. దశాబ్దాలుగా తాను ప్రాతినిధ్యం వహిస్తున్న కుప్పం స్థానాన్ని చంద్రబాబు ఈ దఫా తన కుమారుడు లోకేష్ కు ఇస్తారని.. ఆయన అనంతపురంలోని ఏదో ఒక నియోజకవర్గం నుంచి పోటీ చేస్తారని ఊహాగానాలు వెలువడ్డాయి. చంద్రబాబు కళ్యాణదుర్గం నుంచి పోటీ చేయడం ఖాయమని కూడా వార్తలొచ్చాయి.
చంద్రబాబు అనంతపురం జిల్లా నుంచి పోటీ చేస్తే బాలయ్య హిందూపురం బరిలో ఉండరని.. ఆయన కృష్ణా జిల్లాలో ఏదో ఒక సీటు ఎంచుకుంటారని కథనాలు వినిపించాయి. తద్వారా రెండు జిల్లాల్లో పార్టీకి లబ్ధి చేకూరుతుందని విశ్లేషణలు వెలువడ్డాయి. వాటన్నింటినీ పటాపంచలు చేస్తూ బాలయ్య తాను పోటీ చేసే స్థానంపై ప్రస్తుతం పరోక్షంగా క్లారిటీ ఇచ్చేశారు. చాన్నాళ్లుగా నియోజకవర్గ పర్యటనకు దూరంగా ఉన్న ఆయన తాజాగా అక్కడికి వెళ్లారు. కార్యకర్తలతో సమావేశమయ్యారు. హడావుడి చేశారు. దీంతో వచ్చే ఎన్నికల కోసం బాలయ్య ప్రచారం మొదలుపెట్టినట్లేనని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
వాస్తవానికి అనంతపురం జిల్లా అభ్యర్థుల ఎంపిక గురించి టీడీపీ అధినేత చంద్రబాబు ఇటీవల నిర్వహించిన సమీక్షా సమావేశానికి బాలయ్య హాజరుకాలేదు. దీంతో ఆయన హిందూపురం నుంచి బరిలో ఉండరని అనుమానాలు వ్యక్తమయ్యాయి. అయితే - అందరిలాగా బాలయ్య అలాంటి సమీక్షలకు హాజరు కావాల్సిన అవసరం లేదని.. ఆయనకు టికెట్ ఖరారు అయినట్లేనని విశ్లేషకులు చెబుతున్నారు. నియోజకవర్గంలో ఆయన తాజా పర్యటనే ఇందుకు నిదర్శనమని వారు సూచిస్తున్నారు.