Begin typing your search above and press return to search.

రాష్ట్రపతి ఎన్నికపై వచ్చేసిన క్లారిటి

By:  Tupaki Desk   |   11 March 2022 4:57 AM GMT
రాష్ట్రపతి ఎన్నికపై వచ్చేసిన క్లారిటి
X
తొందరలో జరగబోయే రాష్ట్రపతి ఎన్నికపై క్లారిటి వచ్చేసింది. నాలుగు రోజుల క్రితంవరకు కూడా సొంతంగా అభ్యర్ధిని నిలిపి గెలిపించుకునే అవకాశాలు బీజేపీ తక్కువగా ఉండేది. ఎందుకంటే కేంద్రంలో అధికారం పేరుకు ఎన్డీయేదే అయినా బీజేపీని మినహాయిస్తే మిగిలిన మిత్రపక్షాల బలం నామమాత్రమే. అందుకని ఎన్డీయే తరపున అభ్యర్ధిని పోటీచేయించి గెలిపించుకోవాలంటే బయటనుండి కొత్తపార్టీల మద్దతు చాలా అవసరం.

అందుకనే నరేంద్రమోడి కొత్తపార్టీల మద్దతుకోసం అవస్తలు పడింది. అప్పటికి ఐదు రాష్ట్రాల ఎన్నికలు జరగలేదు. ఆ ఎన్నికల్లో ఫలితాలు ఎలా వస్తాయో ఎవరూ చెప్పలేకున్నారు. అయితే గురువారం వెల్లడైన ఎన్నికల ఫలితాలతో సీన్ మొత్తం మారిపోయింది. ఐదు రాష్ట్రాల ఎన్నికల్లో పంజాబ్ మినహా మిగిలిన ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్, మణిపూర్, గోవాలో బీజేపీ గెలిచింది. దీంతో బీజేపీ సంఖ్యాబలం ఒక్కసారిగా పెరిగినట్లయ్యింది.

ఐదు రాష్ట్రాల్లో అధికారంలోకి రావటం ఎంతవరకు ఖాయమో తెలీని పరిస్దితిలో యూపీఏకి నేతృత్వం వహిస్తున్న కాంగ్రెస్ సీనియర్ నేత గులాంనబీ ఆజాద్ పేరును మోడి ప్రతిపాదించినట్లు ప్రచారం జరిగింది.

అయితే ఎన్నికల ఫలితాల తర్వాత సొంతంగానే అభ్యర్ధిని పోటీచేయించి గెలిపిచుకునేంత సంఖ్యాబలం ఎన్డీయేకి వచ్చేసింది. కాబట్టి నరేంద్రమోడి ఎవరిని అనుకుంటే వారే రాష్ట్రపతి అయిపోవటం దాదాపు ఖాయమనే చెప్పాలి.

మరి గతంలో ప్రచారం జరిగినట్లు ఆజాద్ పేరునే మోడి పరిశీలిస్తారా ? లేకపోతే కొత్త పేరేదైనా తెరమీదకు వస్తుందా అన్నది చూడాలి. జూలై 24వ తేదీతో రామ్ నాద్ కోవింద్ పదవీకాలం పూర్తయిపోతుంది.

ఎంపీలు, ఎంఎల్ఏలు, ఎంఎల్సీల మొత్తం ఎలక్టోరల్ ఓట్లు 10,98,903లో బీజేపీకి సగంకన్నా ఎక్కువ బలమే వచ్చేసింది. కాబట్టి రాష్ట్రపతి అభ్యర్ధి ఎంపిక లేదా ఎన్నికలో మోడి టెన్షన్ పడాల్సిన అవసరం లేదేమో.