Begin typing your search above and press return to search.

ఆంధ్రోళ్లు.. ఆంధ్రోళ్లనే తిట్టుకున్నారు

By:  Tupaki Desk   |   24 Jun 2015 10:18 AM GMT
ఆంధ్రోళ్లు.. ఆంధ్రోళ్లనే తిట్టుకున్నారు
X
ఏదైనా అంశాన్ని సాధించాలంటే ఐకమత్యం చాలా అవసరం. కలిసికట్టుగా చేస్తేనే ఫలితం కష్టంగా ఉండే సమయంలో.. ఒకరిని ఒకరు తిట్టుకోవటం.. అది కూడా విభేదాలు బయటకు రావటం ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. సెక్షన్‌ 8 అమలుపై ఏపీ జర్నలిస్టుల ఫోరం ఒక రౌండ్‌ టేబుల్‌ సమావేశాన్ని నిర్వహించింది.



సహజంగా ఇలాంటి రౌండ్‌ టేబుల్‌ సమావేశానికి హాజరైన వారంతా ఒకేమాటగా ఉంటూ.. ఒకే వాదనను వినిపిస్తారు. తమ డిమాండ్‌ను సాధించుకునేందుకు ఏం చేయాలన్న అంశంపై మధనం జరుపుతారు. కానీ.. ఇందుకు భిన్నమైన ఘటనలు చోటు చేసుకోవటంతో పాటు.. దీనికి హాజరైన ఆంధ్రాళ్లు.. తమ తోటి ఆంధ్రోళ్ల మీద విరుచుకుపడటం గమనారÛం. ఈ సందర్భంగా ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకున్నారు.



ఏపీ ఎన్జీవోలకు.. ఏపీ లాయర్లకు మధ్య జరిగిన లల్లి ఇప్పుడు అందరిని ఆశ్చర్యానికి గురి చేస్తుంది. జరిగిపోయిన విభజనకు సంబంధించి.. నాడు విభజనకు వ్యతిరేకంగా నిర్వహించిన ఉద్యమంలో తమను దెబ్బ తీశారని.. రాష్ట్ర ప్రయోజనాలను పక్కన పెట్టి ఫిట్‌ మెంట్‌కోసం పాకులాడారని విమర్శలకు దిగటం.. రౌండ్‌ టేబుల్‌ సమావేశం పక్కదారి పట్టింది.

ఉమ్మడిగా కలిసి పోరాడాల్సిన వేదికలో.. ఇష్యూ పట్ల ఆంధ్రోళ్లకు ఉన్న కమిట్‌ మెంట్‌ చూసి షాక్‌ తినే పరిస్థితి. విభేదాలుఎన్ని ఉన్నా.. ఇష్యూ ఏదైనా వచ్చినప్పుడు ఏకం అయి.. అనుకున్నది సాధించుకునే తెలంగాణ సంఘాలకు భిన్నంగా ఆంధ్రా సంఘాల మధ్య చోటు చేసుకున్న లల్లి చూసిన వారు.. అసలు విషయాన్ని వదిలేసి.. ఎప్పుడో జరిగిపోయిన ముచ్చట గురించి ఇప్పుడు వాదులాడుకోవటం ఏమిటని విస్మయం చెందే పరిస్థితి.