Begin typing your search above and press return to search.
రూ.500 కోసం దారుణంగా కొట్టాడు .. చివరికి ప్రాణం.. !
By: Tupaki Desk | 7 Aug 2021 11:30 PM GMTడబ్బు అన్నింటికి మూలం. ప్రతి ఒక్కరి జీవితంలో పొద్దున్న లేచినప్పటి నుండి రాత్రి పడుకునే వరకు డబ్బే ముఖ్యం. ప్రస్తుత రోజుల్లో మనిషి విలువ కూడా డబ్బుతోనే ముడిపడిపోయింది. మనిషి జీవనం కోసం డబ్బుని సృష్టిస్తే ..ఇప్పుడు అదే డబ్బు కోసం మనిషి మనిషిని చంపడానికి కూడా వెనుకాడటం లేదు. ఎలాంటి బంధాలైనా డబ్బుతోనే ముడిపడుతున్నాయి. డబ్బుతోనే అంతరించిపోతున్నాయి. చివరకు డబ్బు ప్రాణాలను సైతం తీస్తూ అనేక రకాల సమస్యల సృష్టిస్తోంది. డబ్బే అన్ని రకాల సమస్యల తీసుకొస్తుంది. డబ్బుల కోసం ఇద్దరు మిత్రుల మధ్య తలెత్తిన వివాదం ఒకరి ప్రాణాలు తీసే వరకు వెళ్లింది.
తాజాగా రూ.500 కోసం స్నేహితుల మధ్య తలెత్తిన వివాదం.. ఒకరి ప్రాణాలను బలితీసుకుంది. ఈ దారుణ సంఘటన తెలంగాణలోని నిజామాబాద్ జిల్లా రూరల్ మండలంలోని మల్లారం గ్రామంలో శుక్రవారం సాయంత్రం జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం ఈ నెల 4వ తేదీన మల్లారం కల్లు కాంపౌండ్లో జగడం విఠల్, తోట జయకృష్ణ, జగడం గంగారాంలు కల్లు సేవించారు. అయితే, జగడం విఠల్ వద్ద స్నేహితుడు జయకృష్ణ గత కొన్ని రోజుల కిందట రూ.500 అప్పుగా తీసుకున్నాడు.
తాగిన మత్తులో తన డబ్బులు తనకు ఇచ్చేయాలని గొడవకు దిగాడు. అంత వరకు కల్లు కాంపౌండ్ నుండి కదిలేది లేదన్నాడు. ఈ క్రమంలోనే ఇరువురి మధ్య మాటామాటా పెరగడంతో తీవ్ర ఘర్షణ జరిగింది. తోట జయకృష్ణతో పాటు జగడం గంగారాంలు మత్తులో విఠల్ ను తీవ్రంగా గాయపరిచారు. విఠల్ కల్లు కంపౌండ్ లోనే స్పృహ తప్పి పడిపోయాడు. విఠల్ పరిస్థితిని గమనించి కుటుంబ సభ్యులకు స్థానికులు సమాచారం అందించారు. అతన్ని వెంటనే నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని సన్ రైజ్ ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ శుక్రవారం రాత్రి మృతిచెందాడు. మృతుడి కుమారుడు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.