Begin typing your search above and press return to search.

మినిస్టర్ గన్ మెన్లు ఎంతలా కొట్టారంటే..?

By:  Tupaki Desk   |   18 Dec 2015 5:37 AM GMT
మినిస్టర్ గన్ మెన్లు ఎంతలా కొట్టారంటే..?
X
హైదరాబాద్ మహానగరంలో రోడ్డు యాక్సిడెంట్లు చాలా కామన్. ఎవరికి వారు ఇష్టారాజ్యంగా వాహనాల్ని నడపటం.. నిబంధనల్ని పెద్దగా పట్టించుకోవటం లాంటివి అస్సలు ఉండకపోవటంతో నిత్యం చాలానే ప్రమాదాలు జరుగుతుంటాయి. ఒకవేళ.. వాహనాలు నడిపే వారు జాగ్రత్తగా ఉన్నా.. ఎదురుగా వచ్చే వారు సరిగా లేకపోయినా.. బలి కావాల్సింది సదరు వాహనం నడిపేవారు. తాజాగా ఒక యువకుడు బైక్ మీద అదుపు తప్పి.. మంత్రి పద్మారావు కాన్వాయ్ లోని వాహనాన్ని గుద్దేశాడు.

తప్పుగా వచ్చి గుద్దాడో.. లేక పొరపాటున జరిగిందన్న విషయంపై స్పష్టత లేదు కానీ.. సదరు కుర్రాడిని తీవ్రంగా కొట్టటం వివాదాస్పదమైంది. ఇక.. ఆ కుర్రాడు ఎవరంటే.. రంగారెడ్డి జిల్లా ఏడవ అదనపు జిల్లా జడ్జి శ్రీనివాసరావు కుమారుడు గణేష్. బుధవారం వెస్ట్ మారేడుపల్లిలో చోటు చేసుకున్న ఈ యాక్సిడెంట్ అనంతరం.. మంత్రి వాహనంలో ఉండగా..ఆయన ఎదుటే అంగరక్షకులు తీవ్రంగా కొట్టారు.

దీంతో ఆ యువకుడి చెవికి తీవ్ర గాయమైంది. వైద్య పరీక్షలకు పంపిన అనంతరం.. ఆ కుర్రాడి చెవికి శస్త్రచికిత్స చేయాల్సి ఉంటుందని వైద్యులు తేల్చారు. గన్ మెన్లు ఎంతలా కొడితే అంతలా గాయం అవుతుందన్న విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఈ నేపథ్యంలో తండ్రి అయిన జడ్జి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. ఎంత వాహనాన్ని గుద్దితే చట్టప్రకారం చర్యలు తీసుకోవాలే కానీ.. అలా ఇష్టారాజ్యంగా కొట్టేయటం ఏమిటి? ఇలా కొట్టుకుంటూ పోయే దానికి చట్టం.. పోలీస్ వ్యవస్థలు లాంటివి ఎందుకో..?