Begin typing your search above and press return to search.

యూపీలో పోలింగ్ తీరు మార‌దంతే!

By:  Tupaki Desk   |   23 Feb 2017 6:44 AM GMT
యూపీలో పోలింగ్ తీరు మార‌దంతే!
X
ఉత్త‌ర‌ప్ర‌దేశ్ ల‌లో ఎన్నిక‌ల‌న‌గానే... హింస లేకుండా అక్క‌డ ఎన్నిక‌లు జ‌రిగిన దాఖ‌లా లేని వైనం మ‌న‌కు క‌ళ్ల‌కు క‌డుతుంది. దేశ రాజ‌కీయాల్లోనే అత్యంత కీల‌క రాష్ట్రంగా ప‌రిగ‌ణిస్తున్న యూపీలో ప్ర‌స్తుతం అసెంబ్లీ ఎన్నికలు జ‌రుగుతున్న విష‌యం తెలిసిందే. ఈ ఎన్నిక‌ల్లో ఇప్ప‌టిదాకా మూడు ద‌శ‌ల పోలింగ్ పూర్తి కాగా... పెద్ద‌గా హింస చోటుచేసుకున్న దాఖ‌లా లేదు. దీంతో యూపీ ఎన్నిక‌లు ప్ర‌శాంత వాతావ‌ర‌ణంలో జ‌రుగుతున్నాయ‌ని అంతా సంత‌తోషించారు. అయితే నేటి ఉద‌యం ప్రారంభ‌మైన నాలుగో ద‌శ పోలింగ్ ఆ సంతోష‌మంతా ఆవిరిపైపోయింది.

ఎప్ప‌టిలాగే యూపీ ఎన్నిక‌ల్లో కాల్పుల మోత‌తో అక్క‌డి పోలింగ్ బూత్‌ లు ద‌ద్ద‌రిల్లాయి. యూపీలోని అధికార ప‌క్షం స‌మాజ్ వాదీ పార్టీ - విప‌క్ష బ‌హుజ‌న స‌మాజ్ పార్టీ కార్య‌క‌ర్త‌ల మ‌ధ్య ఘ‌ర్ష‌ణ చోటుచేసుకుంది. ఓ పోలింగ్ కేంద్రానికి ఆమ‌డ‌దూరంలో ఎదురెదురుగా మోహ‌రించిన రెండు వ‌ర్గాల మ‌ధ్య నెల‌కొన్న వివాదం చిలికిచిలికి గాలివాన‌లా మారింది. ఈ క్ర‌మంలో ఇరు వ‌ర్గాలు ఘ‌ర్ష‌ణ‌కు దిగ‌డంతో పాటు చేతుల్లోని తుపాకుల‌కు కూడా ప‌నిచేప్పాయి. మ‌హోబల్ ప్రాంతంలో చోటుచేసుకున్న ఈ ఘ‌ట‌న‌లో ఇరువ‌ర్గాల‌కు చెందిన కార్య‌క‌ర్త‌ల‌కు గాయాల‌య్యాయి.

అయితే స‌కాలంలో స్పందించిన పోలీస‌లు రంగంలోకి దిగి ఇరువ‌ర్గాల‌ను చెద‌ర‌గొట్టారు. ఇక నాలుగో ద‌శ పోలింగ్ విష‌యానికి వ‌స్తే.. యూపీలోని 12 జిల్లాల‌కు చెందిన 53 అసెంబ్లీ నియోజ‌క‌వ‌ర్గాల‌కు పోలింగ్ జ‌రుగుతోంది. మొత్తం 680 మంది అభ్య‌ర్థులు త‌మ అదృష్టాన్ని ప‌రీక్షించుకుంటున్నారు. వీరి భ‌విష్య‌త్తు తేల్చేందుకు 1.8 కోట్ల మంది ప్ర‌జ‌లు త‌మ ఓటు హ‌క్కు వినియోగించుకోనున్నారు. ఉద‌యం పోలింగ్ ప్రారంభ‌మైనప్ప‌టి నుంచే ఓట‌ర్లు పోలింగ్ కేంద్రాల ముందు బారులు తీరారు.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/