Begin typing your search above and press return to search.
పోలింగ్ బూత్ లో కొట్టుకున్నారు..
By: Tupaki Desk | 11 April 2019 10:07 AM GMTఏపీ ఎన్నికల వేళ అధికార టీడీపీ - ప్రతిపక్ష వైసీపీ నేతల మధ్య ఘర్షణలు కొనసాగుతున్నాయి. పరిస్థితి ఉప్పు - నిప్పులా మారింది. ఎక్కడ చూసినా ఇరువర్గాలు దాడులు - ప్రతిదాడులతో హోరెత్తిస్తున్నాయి. తాజాగా నరసారావుపేట అసెంబ్లీ నియోజకవర్గం పరిధిలో పోలింగ్ బూత్ లోనే పరస్పరం వాగ్వాదానికి దిగి ఒకరినొకరు కొట్టుకున్నారు. పరిస్థితి చేయిదాటిపోవడంతో పోలీసులు వచ్చి లాఠీచార్జి చేశారు. దీంతో కొద్దిసేపు పోలింగ్ ను నిలిపివేశారు. సమాచారం అందుకున్న డీఎస్పీ సంఘటన స్థలానికి చేరుకొని పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చారు. అయినా అక్కడ ఉద్రిక్త పరిస్థితి కొనసాగుతోంది.
నరసారావుపేటలోని 100వ బూత్ నంబర్ లో పోలింగ్ కొనసాగుతుండగా ఓటు వేయడానికి పోలింగ్ కేంద్రానికి చేరుకున్న టీడీపీ - వైసీపీ నాయకులు క్యూలో నిల్చున్నారు. వీరు ఓటు వేయడానికి లోపలికి వెళ్లాక గుర్తింపు కార్డుల విషయంలో ఇద్దరు టీడీపీ - వైసీపీ నాయకుల మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. ఇది చిలికిచిలికి రెచ్చగొట్టుకునే వారికి వెళ్లింది. పోలింగ్ కేంద్రంలోనే ఒకరినొకరు కొట్టుకున్నారు. ఘర్షణ పడ్డారు. పోలింగ్ సిబ్బంది కోసం ఉంచిన ప్లాస్టిక్ కుర్చీలను తీసుకొని కొట్టుకున్నారు.
ఇక వీరి ఘర్షణలో పోలింగ్ బూత్ లోని ఫర్నిచర్ ధ్వంసమైంది. పోలింగ్ కేంద్రం వెలుపల ఉన్న ఒకే ఒక కానిస్టేబుల్ లోపలికి వచ్చి వీరిని చెదరగొట్టారు. లాఠీచార్జి చేసి వారిని అక్కడి నుంచి పంపించివేశారు. ఘర్షణ సమయంలో ఒకే కానిస్టేబుల్ ఉండడంతో అదుపు చేయడం సాధ్యం కాలేదు. దీంతో బూత్ లో విధ్వంసం కొనసాగింది.