Begin typing your search above and press return to search.
టీఆర్ఎస్-బీజేపీ కార్యకర్తల మధ్య ఘర్షణ
By: Tupaki Desk | 7 Feb 2021 5:20 PM GMTవరంగల్ లో పరస్పర దాడులు చేసుకున్న టీఆర్ఎస్-బీజేపీ నేతలు ఇప్పుడు సూర్యపేట జిల్లాలోనూ తలపడ్డారు. ఇన్నాళ్లు బీజేపీ నేతల అత్యుత్సాహాలకు టీఆర్ఎస్ దండు కామ్ గా ఉండేది. కానీ ఇప్పుడు బీజేపీతో పోటీపడి మరీ టీఆర్ఎస్ శ్రేణులు సై అంటే సై అంటున్నారు.
తాజాగా సూర్యపేట జిల్లా గుర్రంపోడు తండాలో ఉద్రిక్తత నెలకొంది. హుజూర్ నగర్ ఎమ్మెల్యే సైదిరెడ్డి తమ భూములను ఆక్రమించుకున్నారని ఆరోపిస్తూ గిరిజనులు ఆందోళనకు దిగారు. వారికి బీజేపీ నేతలు సంఘీభావం తెలిపారు.
దీంతో టీఆర్ఎస్ బీజేపీ కార్యకర్తలకు మధ్య ఘర్షణ జరిగింది. రాళ్లతో దాడి చేసుకున్నారు. పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో పోలీసులు నేతలను చెదరగొట్టి పరిస్తితిని అదుపులోకి తెచ్చారు.
ఇక ఇదే సమయంలో బీజేపీ చీఫ్ బండి సంజయ్, ఇతర నేతలు ‘గిరిజన భరోసా యాత్ర’ పేరుతో అక్కడికి రావడంతో పోలీసులు అప్రమత్తమయ్యారు.