Begin typing your search above and press return to search.

రెండు ప్రముఖ చానెల్స్ ఢీ అంటే ఢీ..చంద్రబాబు మీడియేటరా?

By:  Tupaki Desk   |   20 Aug 2020 5:45 AM GMT
రెండు ప్రముఖ చానెల్స్ ఢీ అంటే ఢీ..చంద్రబాబు మీడియేటరా?
X
బయటకు మీడియా అంతా ఒకటే.. కానీ రాజకీయ పార్టీలు ఇందులో ఎంట్రీ ఇచ్చాక వేరుపడ్డాయి. పార్టీల కోసం ఇప్పుడు విడిపోయి కొట్టుకుంటున్నాయి. తెలుగు రాష్ట్రాల్లో నంబర్ 2 - నంబర్ 3 టీఆర్పీ రేటింగ్ లు గల ప్రముఖ న్యూస్ చానెల్ లోని లొసుగులు తాజాగా బయటపడ్డాయి. వాళ్ల ఇద్దరి మధ్య ఉన్న ఇగో ఫీలింగ్ వల్ల ఒకరి బండారం మరొకరు బయటపెట్టుకుంటూ బజారున పడుతున్నారన్న చర్చ మీడియా వర్గాల్లో సాగుతోంది.

ఇందులో ఒక చానెల్ పూర్తిగా టీడీపీ సైడ్.. ఇంకొక చానెల్ మాత్రం గోడ మీద పిల్లి మాదిరి ఎవరు అధికారంలో ఉంటే వాళ్ల సైడ్ వాలిపోతుంది. రెండు చానెల్స్ యజమానులు వైఎస్ రాజశేఖర్ రెడ్డి ప్రభుత్వం ఉన్నప్పుడు బాగా బాగుపడ్డాయి.. అప్పుడు ఇద్దరు ప్రభుత్వాన్ని అడ్డం పెట్టుకొని రియల్ ఎస్టేట్ చేసి.. బిజినెస్ పీపుల్ ను న్యూస్ చానెల్ తో ఇండైరెక్ట్ గా బెదిరించి డబ్బులు దండుకున్నారన్న ఆరోపణలున్నాయి.

తాజాగా ఒక చానెల్ బండారం బయటపడింది. ఆ చానెల్ గతంలో సొంతంగా హెయిర్ ఆయిల్ ప్రొడక్ట్ ను అభివృద్ధి చేసి దానికి విపరీతమైన ప్రచారాన్ని తన చానెల్ ద్వారా కల్పించి ఒక రేంజ్ కు తీసుకెళ్లింది. ఆ హెయిర్ ఆయిల్ తో జుట్టు మొలుస్తుందని నమ్మించి కోట్లు దండుకుందని ఇంకొక చానెల్ తాజాగా ప్రోమోలు రిలీజ్ చేసి ఆరోపించిన వైనం మీడియా సర్కిల్స్ లో హాట్ టాపిక్ గా మారింది. ఇంకొక చానెల్ యజమాని నీతి నిజాయితీ లేక తాజాగా అధికారంలోకి వచ్చిన ప్రభుత్వం పెద్దల కాళ్లకు దండం పెట్టేసి లొంగిపోయాడని ప్రత్యర్థి చానెల్ ఆరోపణ..

అయితే ఈ రెండు చానెల్స్ అధిపతులు ఒకే సామాజికవర్గం వాళ్లు కావడం విశేషం. 2014 నుంచి 2019 మధ్యలో ఇదే సమస్య ఉంటే ఆ రోజు సీఎంగా ఉన్న చంద్రబాబు ఇద్దరినీ కూర్చుండబెట్టి ఇలా ఒకరి మీద ఒకరు ఆరోపణలు చేసుకుంటే ఇద్దరూ నష్టపోతారని.. ఇద్దరు ఒకరి మీద ఒకరు వేలు పెట్టుకోకుండా మధ్యవర్తిత్వం వహించాడని ఆ టైంలో పెద్ద ఎత్తున సోషల్ మీడియాలో న్యూస్ వైరల్ అయ్యింది.

ఇప్పుడు మళ్లీ అదే సమస్య ఆ రెండు చానెల్స్ మధ్య వచ్చింది. ఒక చానెల్ అధికార పార్టీ పెద్దలకు బాగా దగ్గరైందని టాక్. అందుకే తాజాగా టీడీపీకి సపోర్ట్ చేసే చానెల్ ను టార్గెట్ చేశారని తెలుస్తోంది.ఇద్దరి మధ్య మళ్లీ చంద్రబాబు కూర్చొని సెట్ చేయాలని.. ఇద్దరికీ సన్నిహితంగా ఉన్న సామాజికవర్గాల పెద్దలు సూచిస్తున్నారట.. ఇప్పుడిదే అంశం జూబ్లీహిల్స్ లోని మీడియా వర్గాల్లో చక్కర్లు కొడుతోంది. అయితే ఫైనల్ గా ఈ ఇద్దరు బ్లాక్ మెయిలర్స్ అని.. సమాజాన్ని ఇద్దరు వాళ్ల న్యూస్ తో సర్వనాశనం చేస్తున్నారని వీళ్ల చానెల్స్ గురించి బాగా తెలిసిన వారి వాదన..