Begin typing your search above and press return to search.

చైనాతో ఘర్షణ: 'భారత జవాన్లు ఎవరూ చనిపోలేదు, తీవ్రగాయాలు కాలేదని కేంద్రం ప్రకటన

By:  Tupaki Desk   |   13 Dec 2022 7:35 AM GMT
చైనాతో ఘర్షణ: భారత జవాన్లు ఎవరూ చనిపోలేదు, తీవ్రగాయాలు కాలేదని కేంద్రం ప్రకటన
X
అరుణాచల్‌ప్రదేశ్‌లోని తవాంగ్ సెక్టార్‌లో భారత్, చైనా సైనికుల మధ్య జరిగిన ఘర్షణలో ఎలాంటి ప్రాణ నష్టం లేదా మన సైనికులకు ఎలాంటి తీవ్ర గాయాలు కాలేదని రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ మంగళవారం లోక్‌సభలో తెలిపారు. పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ (పిఎల్‌ఎ) దళాలు తవాంగ్ సెక్టార్‌లో యథాతథ స్థితిని మార్చడానికి ప్రయత్నించినప్పుడు భారత దళాలు మా భూభాగాన్ని ఆక్రమించకుండా వారిని ఆపివేసి, తిరిగి తమ స్థానాల్లోకి వెళ్లమని బలవంతం చేశాయని ఆయన అన్నారు.

పార్లమెంటును ఉద్దేశించి రాజ్‌నాథ్ సింగ్ మాట్లాడారు. డిసెంబర్ 9న భారత్, చైనా సైనికుల మధ్య జరిగిన ఘర్షణలో ఇరుపక్షాలకు 'చిన్న గాయాలు మాత్రమే అయ్యాయని.. దీనికి సంబంధించిన వివరాలను అందించారు. దౌత్య మార్గాల ద్వారా ఈ విషయాన్ని చైనా పక్షానికి చేరవేసినట్లు ఆయన తెలిపారు.

గత శుక్రవారం తవాంగ్‌కు సమీపంలోని యాంగ్‌స్టే ప్రాంతంలో ఉద్రిక్తతతో భారత, చైనా సైనికులు ఘర్షణ పడ్డారు, ఫలితంగా ఇరువైపులా చిన్నపాటి గాయాలు అయ్యాయి. ఎదురుదాడుల్లో ఆరుగురు భారత సైనికులు గాయపడ్డారు. వారిని చికిత్స కోసం గౌహతిలోని బసిస్తాలోని 151 బేస్ హాస్పిటల్‌కు విమానంలో తరలించారు.

"డిసెంబర్ 9న తవాంగ్ సెక్టార్‌లోని యాంగ్ట్సే ప్రాంతంలో చైనా దళాలు చొరబడి యథాతథ స్థితిని మార్చడానికి ప్రయత్నించాయి. ఈ ప్రయత్నాన్ని భారత దళాలు తిప్పికొట్టాయి. మా దళాలు చైనా సైన్యాన్ని భారత భూభాగంపైకి చొరబడకుండా ధైర్యంగా ఆపివేసి, వారిని బలవంతంగా వెనక్కి వెళ్లేలా చేశాయి." అని రక్షణ మంత్రి అన్నారు.

"భారత సైనిక కమాండర్ సమయానుకూల జోక్యం కారణంగా.. చైనా సైనికులు వెనక్కి వెళ్లాల్సి వచ్చింది. డిసెంబరు 11న ఆ ప్రాంతం స్థానిక కమాండర్ ఈ సంఘటనపై తన చైనా కౌంటర్‌తో ఫ్లాగ్ మీటింగ్ నిర్వహించారు. అటువంటి చర్యలకు వ్యతిరేకంగా చైనా పక్షాన్ని హెచ్చరించారు.. సమస్యను దౌత్య స్థాయిలో పరిష్కరించుకుంటాం" అని రాజ్ నాథ్ అన్నారు.

"మా దళాలు ఈ ప్రయత్నాన్ని తమదైన పద్ధతిలో ఎదుర్కొన్నాయి. ఈ ముఖాముఖిలో భౌతిక పోరాటం జరిగింది. భారత దళాలు చైనా సైనికులను చొరబాటును ధైర్యంగా నిలిపివేసి, వారి స్థానాలకు తిరిగి వెళ్లేలా చేశాయి. ఈ పోరాటంలో ఇరుపక్షాల సైనికులు గాయపడ్డారు. భారతీయ సైనికులెవరూ చనిపోలేదు.. లేదా తీవ్రంగా గాయపడలేదని రాజ్ నాథ్ పార్లమెంట్ లో ప్రకటన చేశారు.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.