Begin typing your search above and press return to search.
సీఎం - గవర్నర్ ఢీ అంటే ఢీ !
By: Tupaki Desk | 18 Jan 2020 10:53 AM GMTపుదుచ్చేరి లో గవర్నర్ - ముఖ్యమంత్రి మధ్య విబేధాలు తారాస్థాయికి చేరుకున్నాయి. ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకుంటూ ఈ వివాదాన్ని మరింతగా పెంచేస్తున్నారు. నారాయణస్వామి సీఎంగా కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన నాటి నుంచి - లెఫ్టినెంట్ గవర్నర్ గా కిరణ్ బేడి నియమితులైన రోజు నుంచి ఇద్దరి మధ్య ఈ వివాదం జరుగుతూనే ఉంది. ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికైన ప్రభుత్వంలో గవర్నర్ జోక్యం తగదని సీఎం నారాయణస్వామి - కేంద్రపాలిత ప్రాంతంలో గవర్నరే పాలనాధికారి అంటూ కిరణ్‌బేడి మధ్య ఆధిపత్యపోరు సాగుతోంది. సీఎం అనేకసార్లు న్యాయస్థానాన్ని కూడా ఆశ్రయించాల్సి వచ్చింది. ఈ దశలో ఇరువురూ తాజాగా ఒకరిపై ఒకరు మరోసారి సవాళ్లు విసురుకున్నారు.
పుదుచ్చేరి పాగూర్ నియోజకవర్గ కాంగ్రెస్ ఎమ్మెల్యే తంగవేలు ముఖ్యమంత్రి నారాయణస్వామి - మంత్రులు - కాంగ్రెస్ ప్రభుత్వంపై అవినీతి ఆరోపణలు చేశారు. నారాయణస్వామి - ఆయన కుమారుడు భూ అపహరణకు పాల్పడినట్లు - అందుకు ఆధారాలు కూడా ఉన్నట్లు తంగవేలు గవర్నర్ కిరణ్ బేడీని కలిసి ఫిర్యాదు చేశారు. ఎమ్మెల్యే తంగవేలు తనను కలిసి సీఎంపై చేసిన ఫిర్యాదులపై గవర్నర్ పత్రికాప్రకటన కూడా విడుదల చేశారు. లెఫ్టినెంట్ గవర్నర్ కిరణ్ బేడి - కాంగ్రెస్ రెబల్ ఎమ్మెల్యే ఎన్ ధనవేలు తనపై చేస్తున్న అవినీతి ఆరోపణలపై స్పందించిన పుదుచ్చేరి సీఎం నారాయణ స్వామి.. ఏదైనా భూ కబ్జా కేసులో తాను గానీ - తన కుటుంబ సభ్యులు ఎవరైనా దోషులుగా తేలితే పదవిని వదులుకుంటానని తేల్చి చెప్పారు. ఆరోపణలను నిరూపించకపోతే లెఫ్టినెంట్ గవర్నర్ తనకు క్షమాపణలు చెప్పి - పదవిని వదులుకుంటారా ? అని నారాయణ స్వామి సవాల్ చేశారు.
సీఎం నారాయణస్వామి విసిరిన సవాల్ కు సామాజిక మాధ్యమాల ద్వారా స్పందించారు గవర్నర్ కిరణ్ బేడి. సీఎం సవాల్ విసరాల్సింది నాకు కాదు.. వారి ఎమ్మెల్యేకు. సదరు ఎమ్మెల్యేను సస్పెండ్ చేసినట్లు తెలిసింది. ఆరోపణలు చేసింది వారి ఎమ్మెల్యేనే. తండ్రీ - కొడుకులు భూ అపహరణకు సంబంధించి ఆధారాలున్నట్లు చెప్పింది కూడా ఎమ్మెల్యే తంగవేలే. ఆధారాలను సామాజిక మాధ్యమాల్లో ఉంచాలని మీ ఎమ్మెల్యేకు సవాల్ విసరుకోండి అని, సీబీఐ విచారణకు వస్తే ఆరోపణలను ఎదుర్కోండి. అంతేగానీ దయచేసి నాతో ఢీకొనవద్దు అని తెలిపారు.