Begin typing your search above and press return to search.

బక్రీద్ వేళ.. కశ్మీర్ అల్లకల్లోలం

By:  Tupaki Desk   |   22 Aug 2018 11:38 AM GMT
బక్రీద్ వేళ.. కశ్మీర్ అల్లకల్లోలం
X
బక్రీద్ వేళ.. జమ్మూ కాశ్మీర్ అల్లకల్లోలంగా మారింది. స్థానిక ముస్లింలు రెచ్చిపోయారు. ఉగ్రవాదులు కాల్పులకు తెగబడ్డారు. ఇప్పుడు వరుస ఆందోళనలతో మళ్లీ జమ్మూకాశ్మీర్ లో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి..

బక్రీద్ సందర్భంగా ముస్లింలు మసీదుల్లో ప్రార్థనలు చేశారు. అనంతరం కొందరు అతివాద ముస్లింలు.. శ్రీనగర్ వీధుల్లోకి వచ్చి పాకిస్తాన్ - ఐసిస్ జెండాలతో ఆందోళన చేశారు. భారత్ కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. అనంతరం విధ్వంసం సృష్టించారు.

అనంత్ నాగ్ జిల్లాల నిరసన కారులు రెచ్చిపోయారు. భద్రతా బలగాలపై విచక్షణారహితంగా రాళ్లు రువ్వారు. ఆందోళనకారులను చెదరగొట్టేందుకు భారత బలగాలు టియర్ గ్యాస్ ను ప్రయోగించాయి.

కాగా బక్రీద్ సందర్భంగా ఉగ్రవాదులు జమ్మూ కాశ్మీర్ లోని పలు ప్రాంతాల్లో ఆందోళన చేశారు.. మసీదుల్లో ప్రార్థనలు చేసి వస్తున్న ఫయాజ్ అహ్మద్ అనే ట్రైనీ కానిస్టేబుల్ పై కాల్పులు జరిపారు. ఈ ఘటనలో అతడు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. ఇక పుల్వామా జిల్లాలో బీజేపీ అనుకూల నాయకుడు షబ్బీర్ అహ్మద్ భట్ ను ఉగ్రవాదులు అతి దారుణంగా హత్య చేశారు. ఇలా ఆందోళనాకారులు, ఇటు ఉగ్రవాదుల సామూహిక చర్యలతో జమ్మూకాశ్మీర్ ప్రస్తుతం అట్టుడుకుతోంది.