Begin typing your search above and press return to search.
చీలిక దిశగా అన్నాడీఎంకే.. ఫళని, పన్నీర్ ‘సీఎం’ ఫైట్
By: Tupaki Desk | 28 Sep 2020 5:34 PM GMTతమిళనాడు రాజకీయాలు రసకందాయంలో పడ్డాయి. సీఎం ఫళని, డిప్యూటీ సీఎం పన్నీర్ లు సీఎం కుర్చీ కోసం ఫైట్ మొదలుపెట్టారు. అమ్మ జయలలిత హయాంలో ఆమెకు నమ్మిన బంటు పన్నీర్ సెల్వం. అమ్మ జయలలిత కేసులతో జైలు పాలైనప్పుడు పన్నీర్ సెల్వంనే సీఎం కుర్చీలో కూర్చుండబెట్టింది.
అయితే అమ్మ జయలలిత మరణంతో ఆమె స్నేహితురాలు శశికళ ఆధిపత్యం అన్నాడీఎంకేలో వచ్చింది. పన్నీర్ సెల్వంను పక్కనపెట్టి ఫళని స్వామిని సీఎంను చేసింది శశికళ. అయితే శశికళ జైలుకు వెళ్లడంతో పన్నీర్ సెల్వం పార్టీలో అసమ్మతి రాజేశారు. ఆ తర్వాత బీజేపీ ప్రోద్బలంతో పన్నీరు, ఫళని రాజీకొచ్చి సీఎంగా ఫళని.. డిప్యూటీ సీఎంగా పన్నీర్ సెల్వంలు కొనసాగుతున్నారు. అయితే మంత్రుల్లో కేడర్ పరంగా పన్నీర్ సెల్వం పెద్ద వాడు..
అయితే ఇప్పుడు త్వరలో తమిళనాడులో ఎన్నికలు జరగబోతున్నాయి. అన్నాడీఎంకే ఈసారి కష్టమేనంటున్నారు. డీఎంకే స్టాలిన్ గెలుపు పక్కాగా కనిపిస్తోంది. రజినీకాంత్ రాజకీయాల్లోకి వస్తే చెప్పలేం..
అయితే అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో రాజకీయాలు రసవత్తరంగా మారాయి. ఇవాళ జరిగిన అన్నాడీఎంకే సర్వసభ్య సమావేశంలో సీఎం ఫళని స్వామి, డిప్యూటీ సీఎం పన్నీర్ సెల్వం వర్గాల మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది.
రానున్న ఎన్నికల్లో తానే సీఎం అభ్యర్థిగా ఉంటానని ఫళని స్వామితో పన్నీర్ సెల్వం వాగ్వాదానికి దిగారు. తాను తాత్కాలికంగా మాత్రమే డిప్యూటీ సీఎంగా అంగీకరించానని.. ఇకపై అలా కుదరదని పన్నీర్ సెల్వం తేల్చిచెప్పారు. దీంతో అన్నాడీఎంకే పార్టీ చీలిక దిశగా పరిణామాలు కొనసాగుతున్నాయి.