Begin typing your search above and press return to search.

పవన్ ఆవేశం తగ్గించాడా? ఆలోచన పెంచాడా?

By:  Tupaki Desk   |   3 Oct 2021 12:15 PM GMT
పవన్ ఆవేశం తగ్గించాడా? ఆలోచన పెంచాడా?
X
ఏపీలో జనసేన వివిధ కార్యక్రమాలతో దూసుకెళ్తోంది.  ప్రత్యేక సభలు, సమావేశాలు నిర్వహిస్తూ ప్రజలకు చేరువవుతోంది. మొన్నటి వరకు ఎక్కడా కనిపించని జనసైనికులు ఇప్పుడు పార్టీన రాష్ట్రంలో రెండో  ప్రధాన పార్టీగా మారుస్తున్నారు. అటు పవన్ కల్యాణ్ సైతం ఆకట్టుకునే ప్రసంగాలు.. ఉత్తేజపరిచే వ్యాఖ్యలతో ప్రజలకు మరింత దగ్గరవుతున్నారు. ఓ వైపు ప్రభుత్వంపై విమర్శిస్తూనే.. మరోవైపు పార్టీ నాయకుల్లో, ప్రజల్లో ఆసక్తి రేపిస్తున్నారు పవన్. అయితే పవన్ నిర్వహిస్తున్న కార్యక్రమాలకు, సభలకు వైసీపీ ప్రభుత్వం అనేక ఆటంకాలు సృష్టిస్తోంది. అయినా ఏదో రకంగా తాము అనుకున్న పనిని నిర్వహిస్తున్నారు.

2019 అసెంబ్లీ ఎన్నికలే ఒకే ఒక్క సీటు సాధించిన జనసేన పార్టీ పని ఇక అయిపోయిందిన అనుకున్నారు. పవన్  కూడా తీవ్ర నిరాశ చెంది చాలా రోజులు బయటకు రాలేదు. సినిమాల్లోనూ నటించలేదరు. కానీ గత రెండేళ్లుగా సినిమాల్లో బిజీగా మారడంతో పాటు పొలిటికల్ గా పవన్ దూకుడు పెంచారు. ప్రభుత్వం జనసేన నాయకులను ఏదో విధంగా అడ్డుకుంటున్నా.. వారు అనుకున్న పని మాత్రం చేస్తున్నారు. ఇక తాజాగా ఆయన రాయలసీమలో నిర్వహించిన సభలో ఆకట్టుకునే ప్రసంగం చేశారు. గాంధీ జయంతి సందర్భంగా ఆయన చేసిన వ్యాఖ్యలు పలువురిని ఆలోచింపజేస్తున్నాయి.

జనసేన అధినేత పవన్ కల్యాణ్ తాజాగా కర్నూలు జిల్లాలో పర్యటించారు. నగరంలోని కొత్త చెరువోలని నెహ్రూ కూడలిలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో మాట్లాడారు. రానున్నది జనసేన ప్రభుత్వమేనని పార్టీ నాయకుల్లో జోష్ పెంచారు. భయపెడితే భయపడుతారని.. ఎదురు తిరిగితే పారిపోతారన్న నినాదంతో కార్యకర్తలు పనిచేయాలని ఉత్తేజపరిచారు. తాను ఏ కులానికి చెందిన వాడిని కాదని, రెడ్డి సామాజిక వర్గానికి చెందిన చాలా మంది తమ దగ్గర బాధలు చెప్పుకున్నారన్నారు. జిల్లాలోని పార్టీ నాయకుడు చిలకం మధుసూదన్ రెడ్డిపై అన్యాయంగా కేసులు పెడుతున్నారన్నారు. ఆ కేసులన్నీ కోర్టుకెళ్లడంతో సెక్యూరిటీలు తెచ్చుకున్నామన్నారు.

కర్నూలు జిల్లాలో ‘కొనిదెల’ గ్రామం ఉంది. మా ఇండిపేరు కూడా ‘కొణిదెల’. మా ఇంటిపేరు ఊరుపేరు ఒకటి కావడమేంటి..? అంటే సీమతో తమకు అవినాభావ సంబంధం ఉందన్నారు. రాయలసీమలో ప్రేమ ఎక్కువగా ఉంటుందన్నారు. సత్యసాయిబాబా ఒక్కరే ప్రజల గొంతు తడుపుతున్నారన్నారు. మరి ప్రభుత్వాలు ఏం చేస్తున్నట్లు అని ప్రశ్నించారు. సీమ కష్టాలు, ప్రజల అభివృద్ధిపై ప్రభుత్వానికి చిత్త శుద్ధి లేదన్నారు. ప్రభుత్వంలో ఉన్న పాలకులు, పారిశ్రామిక వేత్తలను భయపెడుతున్నారు. అలా భయపెడితే పరిశ్రమలు రాష్ట్రానికి ఎలా వస్తాయ్ ..? అని ప్రశ్నించారు. ఐటీ ఇండస్ట్రీ వస్తుందని గత ఎన్నికల్లో ప్రభుత్వం హామీ ఇచ్చిందన్నారు. ఒక్క ఐటీ కంపెనీని కూడా ఏర్పాటు చేయలేదన్నారు. నాయకులు అవినీతిలో కూరుకుపోతే ఎలాంటి అభివృద్ధి జరగదన్నారు. సీమలో శాంతి భద్రతలకు డోకాలేకుండా చేస్తామన్నారు.

వచ్చే ఎన్నికల్లో జనసేనకు అవకాశం ఇవ్వాలని, మా పార్టీ అధికారంలోకి వస్తే సీమలో సీఎం క్యాంపు ఆఫీసు పెడతామన్నారు. ప్రజలపై దాడి చేస్తే పవన్ కల్యాణ్ వస్తాడన్నారు. అయితే జనసైనికులను ఇబ్బంది పెట్టొద్దని జిల్లా ఎస్పీని కోరారు. ఇక జనసేన సభ జరుగుతున్నంతసేపు జిల్లాలో కరెంట్ తీసేశారు. పార్టీ నాయకులు జనరేటర్ సౌకర్యం ఏర్పాటు చేయడంతో పవన్ ప్రసంగం ముగిసే వరకు జనరేటర్ నడిచింది. అయితే పవన్ సభ పూర్తి కాగానే విద్యుత్ సరఫరా సాగడం గమనార్హం. ఇక పవన్ సభకు వెళ్లే జనసైనికులను పోలీసులు ఎక్కడికక్కడా అరెస్టు చేశారు.అయినా పోలీసుల నుంచి తప్పించుకొని జనసేన సభకు వీరాభిమానులు, మహిళలు, యువతులు పెద్ద ఎత్తున హాజరయ్యారు. మొత్తంగా పవన్ కర్నూల్ సభ సక్సెస్ అయిందని జనసైనికులు ఫుల్ ఖుషీగా ఉన్నారు.