Begin typing your search above and press return to search.
ఆంధ్రా ఆక్టోపస్ మళ్లీ కెలికాడు
By: Tupaki Desk | 30 Jan 2019 12:44 PM GMTఆంధ్రా ఆక్టోపస్ గా చాలా ఫేమస్ లగడపాటి రాజగోపాల్. ఇప్పటివరకు ఆయన చెప్పిన ఫలితాలు ఎక్కడా తప్పలేదు. కొన్నిసార్లు అయితే పర్ ఫెక్ట్ గా వచ్చాయి. కానీ మొన్న జరిగిన తెలంగాణ ఎన్నికల్లో లగడపాటి చెప్పిన సర్వే మొత్తం రివర్స్ అయ్యింది. కాంగ్రెస్ కు ఎక్కువ సీట్లు వస్తాయని లగడపాటి చెప్తే.. రిజల్ట్ మొత్తం టీఆర్ ఎస్ కు ఫేవర్ గా వచ్చింది. దీంతో.. లగడపాటి సర్వేపై నీలినీడలు కమ్ముకున్నాయి. బెట్టింగ్ రాయుళ్లకు లగడపాటి అమ్ముడుపోయారని.. అందుకే సర్వేలతో జనాన్ని తప్పుదారి పట్టించారని విమర్శలు వచ్చాయి. అన్నింటికి మించి.. మొదటిసారి లగడపాటి… మోసం చేశారు అనే యాంగిల్ లో విమర్శలను ఎదుర్కోవాల్సి వచ్చింది. అయితే.. తెలంగాణ ఎన్నికల తర్వాత ఎక్కడా మాట్లాడని లగడపాటి.. బుధవారం ఢిల్లీలో మీడియాతో మాట్లాడారు.
“15 ఏళ్లుగా సర్వేలు చేస్తున్నాం. మొదటిసారి సర్వే తారుమారు అయ్యింది. అయితే అదే సమయంలో ఈవీఎంలు, పోలింగ్ నిర్వహణ తీరుపై నాకు కొన్ని అనుమానాలు ఉన్నాయి. పోలింగ్ శాతం చెప్పడానికి ఎన్నికల కమిషన్ కు రెండు రోజులు ఎందుకు పట్టింది. ఆ తర్వాత కొన్ని నియోజక వర్గాల్లో ఉన్న ఓట్ల కంటే ఎక్కువ ఓట్లు ఎందుకు పోల్ అయ్యాయి. మాకు చాలా సందేహాలున్నాయి. కానీ వాటిని ఈసీ నివృత్తి చేయడం లేదు. వీవీ ప్యాట్ లు లెక్కించాలని చాలా నియోజకవర్గాల అభ్యర్థులు డిమాండ్ చేశారు. అయినా కూడా ఈసీ ఒక్కటంటే ఒక్క చోట కూడా వీవీ ప్యాట్ లు లెక్కపెట్టేందుకు అంగీకరించలేదు. ఇక పంచాయతీ ఎన్నికల విషయానికి వస్తే.. మొన్నటి ఎన్నికల్లో టీఆర్ ఎస్ అద్భుతమైన విజయం సొంతం చేసుకుంది. అలాంటప్పుడు పంచాయతీ ఎన్నికల్లో కూడా టీఆర్ ఎస్ ఏకపక్షంగా గెలవాలి. కానీ ప్రస్తుతం అలాంటి పరిస్థితి కన్పించడం లేదు. ఇంకా చెప్పాలంటే పంచాయతీ ఎన్నికల్లో ప్రతిపక్ష బలం బాగా పెరిగింది. తెలంగాణ ఎన్నికలపై వస్తున్న, చాలామంది వ్యక్తం చేస్తున్న అనుమానాలను తీర్చాల్సిన బాధ్యత ఎన్నికల కమిషన్ పై ఉంది. ఇప్పటికైనా అనుమానాలను తీర్చడానికి వీవీ ప్యాట్ లు లెక్కించాలి. తెలంగాణ ఎన్నికల్లో డబ్బు ప్రభావం గణనీయంగా ఉంటుందని నేను మొదటి నుంచి చెప్తూనే ఉన్నా. తనకు దొంగ సర్వేలు చేసే అలవాటు లేదు. మొన్నటి ఎన్నికల్లో పోలింగ్ కు ముందే సర్వే ఫలితాలు చెప్పి తప్పు చేశాను. ఇక మీదట జీవితంలో అలా ఎప్పుడు చెయ్యను. వచ్చే లోక్ సభ ఎన్నికల కోసం కూడా సర్వే చేస్తాను. అయితే.. పోలింగ్ పూర్తైన తర్వాతే సర్వే గురించి చెప్తాను. అప్పుడు తన సర్వే ఫలితాలు నిజం అయితే.. తెలంగాణ ఫలితాలు ఎందుకు తేడాగా వచ్చాయో అప్పుడు చెప్తాను” అని అన్నారు లగడపాటి.
ఇదే ప్రెస్ మీట్ లో విలేకరులు అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పారు లగడపాటి. మీరు టీడీపీలో ఎప్పుడు చేరుతున్నారు అనే ప్రశ్నకు… చాటుమాటు రాజకీయాలు చేసే వ్యక్తిని కాదని.. రాజకీయాల్లో చేరాలి అనుకుంటే అందరికి చెప్పే చేరతానని అన్నారు. అవకాశం వస్తే తెంలగాణలో పోటీ చేసేందుకు తాను సిద్ధమని మరోసారి ప్రకటింరారు. ఇక ఆంధ్రజ్యోతి ఎండీ రాధాకృష్ణతో కలిసి చంద్రబాబుని రహస్యంగా ఎందుకు కలిశారని విలేకరులు ప్రశ్నించారు. అయితే.. చంద్రబాబుకు తనకు మధ్య జరిగిన సంభాషణను బయటకు చెప్పాల్సిన అవసరం లేదని అన్నారు లగడపాటి. మొత్తానికి తెలంగాణ ఎన్నికల్లో ఏదో జరిగిందని తనదైన స్టైల్ లో హింట్ ఇచ్చిన లగడపాటి.. రాజకీయాల్లో చిన్నపాటి సన్షేషన్ క్రియేట్ చేశారు.