Begin typing your search above and press return to search.
రెండు అడుగుల్లో మహా ఉపద్రవం?
By: Tupaki Desk | 11 Nov 2015 7:16 AM GMTరెండంటే రెండు అడుగుల దూరం. ప్రపంచంలోని పలు దేశాలకు చెందిన 13 కోట్ల మంది ప్రాణాలు ప్రమాదంలో పడే పరిస్థితి. బాధ్యత లేకుండా.. భవిష్యత్తు గురించి ఆలోచించకుండా.. ఇష్టారాజ్యంగా చేస్తున్న పనులు మానవాళిని ప్రమాదంలో పడేయనుంది. రోజురోజుకీ పెరిగిపోతున్న కాలుష్యం ప్రకృతి సహజ ధర్మాన్ని ఎంతలా సవాలు చేస్తుందో తెలిసిందే. నాగరికత పెరుగుతుందని సంబరపడుతున్నా.. మానవాళి బాధ్యత లేకుండా వ్యవహరించటం ఇప్పుడు భవిష్యత్తును భయానకంగా మార్చనుందన్న సంకేతాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి.
పెట్రోల్.. డీజిల్ వినియోగం రోజురోజుకీ పెరిగిపోతూ.. అడవులను కొట్టేయటం కారణంగా ఇప్పటికే భూతాపం పెరిగిపోయిన పరిస్థితి. ఇదే తీరులో కంటిన్యూ అయితే.. మరిన్ని విపరిణామాలు తప్పవని శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు. తాజాగా క్లైమేట్ సెంట్రల్ అనే ఎన్జీవో విడుదల చేసిన నివేదికలో ఆశ్చర్యకరమైన.. ఆందోళన కలిగించే అంశాలు ఉన్నాయి.
ఇప్పుడున్న భూతాపం మరో నాలుగు డిగ్రీలు పెరిగితే.. సముద్ర తీరాల్లో ఉన్న అనేక నగరాలు మునిగిపోవటం ఖాయమంటున్నారు. ఇలా మునిగిపోయే నగరాల్లో అమెరికాలోని న్యూయార్క్.. దక్షిణ అమెరికాలోని రియో డీ జెనీరో.. యూరప్ లో లండన్.. ఆసియాలో ముంబయి.. కోల్ కతా.. షాంఘై.. దక్షిణాఫ్రికాలోని డర్బన్.. ఆస్ట్రేలియాలోని సిడ్నీలతో పాటు.. మరికొన్ని నగరాలతో పోలిస్తే.. దాదాపు 46 నుంచి 76 కోట్ల మంది ప్రభావితం అయ్యే అవకాశం ఉందని హెచ్చరిస్తున్నారు.
నాలుగు డిగ్రీలు కాదు.. ఉష్ణోగ్రతలు 2 డిగ్రీలు పెరిగినా.. భారీ నష్టం తప్పదంటున్నారు. ప్రస్తుతం ఉన్న ఉష్ణోగ్రతలు మరో రెండు డిగ్రీలు తగ్గినా భారీ విలయం తప్పదని హెచ్చరిస్తున్నారు. రెండు డిగ్రీల ఉష్ణోగ్రత పెరగటం అన్నది.. ఉపద్రవానికి రెండు అడుగుల దూరంలో ఉన్నట్లేనని చెప్పొచ్చు. యుద్ధ ప్రాతిపదికన ప్రపంచ దేశాలు కానీ అలెర్ట్ కాకుంటే.. అందుకు మూల్యం ప్రపంచంలోని పలు దేశాల ప్రజలు చెల్లించక తప్పదు.