Begin typing your search above and press return to search.
క్లినికల్ ట్రయల్స్ః జంతువులపై ఆనందయ్య మందు!
By: Tupaki Desk | 26 May 2021 2:30 PM GMTదేశవ్యాప్తంగా సంచలనం రేకెత్తించిన ఆనందయ్య కరోనా మందును జంతువులపై ప్రయోగించేందుకు శాస్త్రవేత్తలు సిద్ధమవుతున్నారు. క్లినికల్ ట్రయల్స్ లో భాగంగా.. ఈ ప్రయోగం చేయబోతున్నారు. ఈ మేరకు తిరుపతిలోని సృజన లైఫ్ ల్యాబ్ లో ప్రయోగాలకు ఉన్న అర్హతలపై ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి తనిఖీ చేశారు.
ఈ సందర్భంగా శాస్త్రవేత్తలు మాట్లాడుతూ.. అనుమతి వస్తే ఆనందయ్య మందుపై ప్రయోగాలు చేస్తామని చెప్పినట్టు సమాచారం. ఎలుకలు, కుందేళ్లపై విడతల వారీగా ప్రయోగం చేసి రిపోర్ట్ ఇస్తామని చెప్పారట. ఈ ప్రయోగానికి 14 నుంచి 28 రోజుల సమయం పడుతుందని సైంటిస్టులు చెప్పినట్టు తెలుస్తోంది.
కరోనా తీవ్రత అధికంగా ఉన్నప్పటికీ.. కంటిలో వేసే మందుపై ముందస్తు ప్రయోగం చేయాల్సిన అవసరం ఉందని శాస్త్రవేత్తలు సూచించినట్టు సమాచారం. అయితే.. జంతువులకు కరోనా సోకించి, ఆ తర్వాత పరీక్షించే వ్యవస్థ మాత్రం తమ వద్ద లేదని చెప్పినట్టుగా తెలుస్తోంది.
మొత్తం నాలుగు దశల్లో ట్రయల్స్ నిర్వహించిన అనంతరం ప్రభుత్వానికి నివేదిక అందుతుందని, ఆ నివేదిక ఆధారంగా మందు పంపినీ కొనసాగిస్తామని ఎమ్మెల్యే చెవిరెడ్డి తెలినట్టు సమాచారం.