Begin typing your search above and press return to search.
హిల్లరీకి షాకిచ్చిన ఎఫ్ బీఐ!
By: Tupaki Desk | 29 Oct 2016 7:35 AM GMTఅమెరికా అధ్యక్ష పదివికి జరగనున్న ఎన్నికలకు మరెంతో సమయం లేదు. ఇంకో 10 రోజులు మాత్రమే సమయున్న నేపథ్యంలో ఆ దేశ అత్యున్నత దర్యాప్తు సంస్థ ఫెడరల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేట్ (ఎఫ్ బీఐ) చేసిన ఓ ప్రకటన పెను సంచలనాలకు తెర తీసేలానే ఉంది. అధ్యక్ష పదవికి డెమోక్రటిక్ పార్టీ అభ్యర్థిగా హిల్లరీ క్లింటన్ - రిపబ్లికన్ పార్టీ అభ్యర్థిగా డొనాల్డ్ ట్రంప్ పోటీ పడుతున్న విషయం తెలిసిందే. ఇప్పటిదాకా ఎన్న ఓపీనియన్ పోల్స్ - వివిధ సంస్థలు నిర్వహించిన సర్వేల్లో హిల్లరీ క్లింటన్ కు స్పష్టమైన ఆధిక్యత ఉంది. బిగ్ డిబేట్లలోనూ హిల్లరీ ఆధిక్యత స్పష్టంగా కనిపించింది. ఈ క్రమంలో అమెరికా అధ్యక్ష పదవిని హిల్లరీ కైవసం చేసుకోవడం ఖాయమని, తద్వారా అమెరికా అధ్యక్ష పదవిని చేజిక్కించుకున్న తొలి మహిళగా హిల్లరీ రికార్డులకెక్కనున్నారన్న వాదన వినిపించింది. ఈ సమయంలో సరిగ్గా ఎన్నికలకు పది రోజుల సమయముందనగా... ఎఫ్ బీఐ చేసిన ఓ ప్రకటన హిల్లరీ విజయావకాశాలను దెబ్బతీసేలానే ఉంది. అమెరికా మాజీ అధ్యక్షుడు బిల్ క్లింటన్ సతీమణి అయిన హిల్లరీ... గతంలో హోం శాఖ కార్యదర్శిగా పనిచేసిన సంగతి తెలిసిందే. ఆ సమయంలో ఆమె ప్రైవేట్ ఈ-మెయిల్ వినియోగించారన్న ఆరోపణలు ఎదుర్కొన్నారు. ఈ విషయంలో ఇప్పటికే కొంత మేర దర్యాప్తు చేసిన ఎఫ్ బీఐ... హిల్లరీ తప్పు చేసినట్లు ఇంకా నిర్ధారించలేదు. ఈ విషయాన్ని పలుమార్లు ప్రస్తావించిన ట్రంప్... ఎఫ్ బీఐ దర్యాప్తు చేస్తే హిల్లరీ నేర చరిత్ర బయటకు వస్తుందని ఆరోపణలు గుప్పించారు. ఇదే సమయంలో అమెరికా చట్టసభ సభ్యుడొకరు ఈ విషయంపై ఎఫ్ బీఐ ప్రధాన కార్యాలయానికి ఓ లేఖ రాశారు. ఈ లేఖకు స్పందించిన ఎఫ్ బీఐ చీఫ్ జేమ్స్ కోమీ నిన్న ఓ ప్రకటన చేశారు. హిల్లరీ ప్రైవేట్ మెయిల్ వాడిన విషయంపై దర్యాప్తు పునఃప్రారంభించనున్నట్లు ఆయన ప్రకటించారు.
అంతేకాకుండా ఈ దర్యాప్తు ఎంతదాకా సాగుతుందో కూడా చెప్పలేనని కూడా ఆయన ఆ ప్రకటనలో పేర్కొన్నారు. ఇదే జరిగితే... ఇప్పటిదాకా ట్రంప్ పై తిరుగులేని ఆధిక్యంతో దూసుకెళుతున్న హిల్లరీకి పెద్ద దెబ్బ తగలక తప్పదన్న భావన వ్యక్తమవుతోంది. ఎఫ్ బీఐ చీఫ్ ప్రకటన హిల్లరీ విజయావకాశాలపై పెను ప్రభావం చూపనుందన్న విశ్లేషణలు సాగుతున్నాయి. ఈ ప్రభావం ఎంతమేర అన్నది వచ్చే నెల 8న జరగనున్న పోలింగ్ తర్వాత కాని వెల్లడయ్యేలా లేదు.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/