Begin typing your search above and press return to search.
నేడే అమెరికా ఎన్నికలు.. హిల్లరీ హ్యాపీ!
By: Tupaki Desk | 8 Nov 2016 4:46 AM GMTఅమెరికా అధ్యక్ష పదవి ఎన్నికలను ప్రపంచమంతా ఎంతో ఆసక్తిగా గమనిస్తోంది. మంగళవారం (నవంబర్ 8) జరిగే ఎన్నికల్లో ఎవరు గెలుస్తారా? వైట్ హౌస్ అధినేత ఎవరు కాబోతున్నారు? ఈ విషయంలో ట్రంప్, హిల్లరీల్లో ఎవరు గెలిస్తే ఎలా ఉంటుందంటూ ప్రపంచ దేశాలన్నీ ఇప్పటికే లాభనష్టాలను బేరీజువేసుకుంటున్నాయి. అయితే ఈ రోజు జరిగే ఎన్నికలపై రాయిటర్స్/ఇప్సాస్ స్టేట్స్ ఆఫ్ ద నేషన్ నిర్వహించిన తుది, తాజా సర్వే వెలువడింది. ఈ లాస్ట్ సర్వే ప్రకారం... హిల్లరీకి 90 శాతం గెలిచే అవకాశాలున్నాయని, ట్రంప్ నకు షాక్ తేలింది.
అయితే... ఈ ఎన్నికలకు సంబందించిన ప్రచారం మొదలైన రోజునుంచీ సర్వేలన్నీ హిల్లరీయే ముందంజలో ఉన్నారని ప్రకటిస్తూ వచ్చాయి. దీంతో పాటు అమెరికాలో హిల్లరీకి భారీ మీడియా సపోర్ట్ కూడా ఉండటంతో ఆమె విజయానికి మంచి మద్దతు లభిస్తుందని కథనాలు వచ్చేవి. ఈ క్రమంలో అనూహ్యంగా ట్రంప్ వివాదాస్పద వ్యాఖ్యలు, మహిళలపై అనుచితంగా ప్రవర్తించినట్టు ఆరోపణల కారణంగా ఆమె మరింత ముందుకెళ్లిపోయారనే చెప్పాలి. అనంతరం హిల్లరీ విషయంలో "ఈ-మెయిల్స్" సమస్య రావడంతో పోటీ హోరాహోరీగా మారింది. ఈ పరిస్థితుల్లో ఒక దశలో ట్రంపే, హిల్లరీకంటే స్వల్ఫ తేడాతో ముందున్నారని కూడా ఒక సర్వే చెప్పింది!
అయితే.. ఫైనల్ గా ఎన్నికల తేదీ సమీపించేసరికి పరిస్థితి పూర్తిగా హిల్లరీకి అనుకూలంగా మారింది. ఈ మెయిల్స్ వ్యవహారంలో ఎఫ్. బీ.ఐ హిల్లరీకి క్లీన్ చిట్ ఇవ్వడంతో హిల్లరీ గెలిచే అవకాశం 90 శాతానికి పెరిగింది. దీంతో వైట్ హౌస్ రేసులో ట్రంప్ ఆశలు ఆల్ మోస్ట్ ఆవిరైపోయినట్లే.
కాగా... అమెరికా అధ్యక్ష పీఠం అధిరోహించాలంటే ఈ 538 ఓట్లలోనూ అభ్యర్థి తప్పకుండా 270 ఎలక్టోరల్ కాలేజీ ఓట్లు సాధించాలనే విషయం తెలిసిందే. అయితే హిల్లరీ ఈ విషయంలో 303 ఓట్లతో తిరుగులేని మెజార్టీ సాధిస్తారని ట్రంప్ కు 235 ఓట్లు వస్తాయని తేలగా... పాపులర్ ఓట్లు హిల్లరీకి 45 శాతం - ట్రంప్ కు 42 శాతం వస్తాయని అంచనా వేసింది. భారత కాలమాన ప్రకారం మంగళవారం సాయంత్రం 5 గంటల నుంచి జరిగే అమెరికా ఎన్నికల్లో దాదాపు 15 కోట్లమంది ఓటు హక్కు వినియోగించుకోనున్నారు.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/