Begin typing your search above and press return to search.
ట్రంప్ చేదు అనుభవం హిల్లరీకి జస్ట్ మిస్
By: Tupaki Desk | 4 Feb 2016 10:30 PM GMTమరికొద్ది నెలల్లో జరిగే అమెరికా అధ్యక్ష ఎన్నికలకు సంబంధించి ఆసక్తికర పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. రిపబ్లికన్ పార్టీ తరఫున అధ్యక్ష ఎన్నికల బరిలో దిగాలని కలలు కంటున్న అభ్యర్థి డోనాల్డ్ ట్రంప్ కు కాలం కలిసి రావటం లేదు. ఇప్పటికే తన దురుసు మాటలతో.. ముస్లిం వ్యతిరేక వ్యాఖ్యలతో ప్రపంచ వ్యాప్తంగా ఆయన చాలా ప్రచారం పొందారు. అయితే.. ఆయన అయోవా రాష్ట్రంలో జరిగిన అంతర్గత ఎన్నికల్లో ఓటమి పాలుకావటం ఆయనకు ప్రతికూలంగా మారింది.
మరోవైపు.. డెమోక్రాట్స్ తరఫున అధ్యక్ష ఎన్నికల బరిలో దిగాలని ఉవ్విళ్లూరుతున్న మాజీ అధ్యక్షుడు బిల్ క్లింటన్ సతీమణి.. హిల్లరీక్లింటన్ కు అదృష్టం కాస్త తోడుగా నిలుస్తున్నట్లు కనిపిస్తోంది. తాజాగా ఆమె తన ఓటమిని తృటిలో తప్పించుకోవటమే నిదర్శనం. అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో డెమోక్రాట్స్ తరఫున బరిలో దిగేందుకు వీలుగా.. ఆమె తన తొలి గెలుపును సొంతం చేసుకున్నారు. అది కూడా అత్తెసరు అధిక్యంతో కావటం గమనార్హం.
తాజా పరిణామాలుచూస్తే.. రిపబ్లికన్ అభ్యర్థి ట్రంప్ కు కాలం కలిసి రావటం లేదన్న వదన వినిపిస్తుంటే.. హిల్లరీ మాత్రం అందుకు భిన్నంగా లక్ తో వెళుతున్నారన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. అయితే.. తాజాగా జరుగుతున్న హాంప్ షైర్ లో జరగనున్న అంతర్గత ఎన్నికలో విజయం కోసం ఆమె హోరాహోరీగా పోరాడుతున్నారు. ఆమెకు ప్రత్యర్థిగా ఉన్న డెమోక్రాటిక్స్ పార్టీ మరో అభ్యర్థి బెర్నీ సాండర్స్ తాజాగా ఎన్నికలు జరగనున్న న్యూ హాంప్ షైర్ ప్రాంతానికి చెందిన వాడు కావటంతో హిల్లరీ కిందామీదా పడుతున్నారు. తాజాగా జరగనున్న ఈ ఎన్నిక తుది ఫలితం ఎలా ఉంటుందన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.