Begin typing your search above and press return to search.
క్లిప్పులు బయటకొచ్చాయ్.. సీసీ పుటేజ్ ఏందో రిలీజ్ చేయండి కొడాలి!
By: Tupaki Desk | 23 Jan 2022 5:03 AM GMTకాసినో మంట ఏపీ ప్రభుత్వాన్ని ఊపేస్తోంది. సంక్రాంతి పర్వదినం సందర్భంగా ఏపీకి ఏ మాత్రం అలవాటు లేని రీతిలో నిర్వహించిన గోవా తరహా విలాసాలు ఇప్పుడు హాట్ టాపిక్ గా మారాయి. ఏదో మాట వరసకు కాకుండా.. కేసినోకు సంబంధించిన వీడియోలు పండుగ సమయంలోనే బయటకు రావటం.. వాటిని చూసినోళ్లంతా ముక్కున వేలేసుకున్న పరిస్థితి. ఈ వ్యవహారం కాస్తా రాజకీయ దుమారంగా మారటం ఒక ఎత్తు అయితే.. తన మీద తీవ్ర విమర్శలు.. భారీ ఆరోపణలు కమ్మేస్తున్న వేళ.. వాటిని తిప్పికొట్టేలా బలమైన వాదనలు వినిపించాల్సిన అవసరం ఉంది.
కానీ.. అలాంటిదేమీ చేయకుండా.. నోటికి వచ్చినట్లుగా మాట్లాడటం వల్ల ఎలాంటి ప్రయోజనం ఉండదన్న విషయాన్ని మంత్రి కొడాలి నాని మర్చిపోయినట్లున్నారు. ఇప్పటికే అర్థం లేని సవాలు విసరటం ద్వారా అడ్డంగా బుక్ అయిన సంగతి తెలిసిందే. గుడివాడలోని తన కె కన్వెన్షన్ లో కాసినో జరగలేదని.. దాన్ని నిరూపిస్తే.. రెండు లీటర్ల పెట్రోల్ పోసుకొని మరీ ఆత్మహత్య చేసుకుంటానని భీకర ప్రతిన పూనటం తెలిసిందే.
కొడాలి నాని నోటి నుంచి ఆ మాటలు వచ్చిన తర్వాత.. తెలుగు తమ్ముళ్లు మరింత ఉత్సాహంగా కేసినోకు సంబంధించిన వీడియోల్ని ప్రెస్ మీట్ పెట్టి మరీ వదిలారు. దీంతో.. కొడాలి అండ్ కో ఆత్మరక్షణలో పడాల్సిన పరిస్థితి. అంతేకాదు.. గోవా కేసినో కల్చర్ ను ఏపీకి తీసుకురావటంపై మండిపాటు వ్యక్తమవుతోంది. ఇలాంటి వేళ.. తన తీరును తప్పు పడుతూ చూపిస్తున్న వేళ్లకు బదులిచ్చేందుకు వీలుగా కొడాలినాని మళ్లీ రియాక్టు అయ్యారు.
తన కన్వెన్షన్ సెంటర్లో ఎలాంటి కాసినో జరగలేదని మరోసారి బలంగా వాదించారు. పక్కా ప్లాన్ ప్రకారమే ఇలాంటి ప్రచారం చేస్తున్నారని మండిపడిన ఆయన.. చంద్రబాబు బ్లాక్ మొయిల్ రాజకీయాలకు పెట్టింది పేరంటూ.. సంబంధం లేని అంశాల్ని తెర మీదకు తీసుకొచ్చే ప్రయత్నం చేశారు.
తనపై ఆరోపణలు చేస్తే భయపడతానని అనుకుంటున్నారని.. కాసినో జరగలేదన్న ఆధారాలు తన వద్ద ఉన్నప్పుడు నిజనిర్దారణ కమిటీ ఎందుకు? అని ప్రశ్నించారు. టీడీపీ నేతలు చేసిన ఆరోపణలు నిరూపించాలని.. లేదంటే తన దగ్గరున్న సీసీ పుటేజ్ విడుదల చేస్తానని.. కాసినో పెట్టినట్లుగా నిరూపిస్తే రాజకీయాలు వదిలేస్తానని మండిపడ్డారు. కొడాలి వారి నోటి నుంచి ఈ తరహా మాటలు వచ్చినంతనే.. ప్రెస్ మీట్ పెట్టిన టీడీపీ సీనియర్ నేత ధూళిపాళ్ల నరేంద్ర .. కొడాలి నాని వారికి చెందిన కె కన్వెన్షన్ సెంటర్ లో ఏర్పాటు చేసిన కాసినో కు సంబంధించిన వీడియో క్లిప్పులు విడుదల చేశారు. ఒకపక్క క్లిప్పుల మీద క్లిప్పులు బయటకు వస్తున్న వేళ.. వాటికి కౌంటర్ వేసేలా కొడాలి వద్దనున్న సీసీ పుటేజ్ లు ఏమిటన్నది బయటకు చూపించాల్సిన అవసరం ఉందన్నమాట వినిపిస్తోంది. మరి.. కొడాలి వారు ఎలా రియాక్టు అవుతారో చూడాలి.