Begin typing your search above and press return to search.
ప్లాస్టిక్ ఫ్లెక్సీల చాప్టర్ క్లోజ్....వారి మాట ఏమిటి....?
By: Tupaki Desk | 22 Sept 2022 8:00 PM ISTఏపీ సర్కార్ సంచలన నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో ప్లాస్టిక్ ఫ్లెక్సీలను నిషేధిస్తూ కీలక అడుగులు వేస్తోంది. నవంబర్ 1 నుంచి ఏపీ అంతటా ఈ నిషేధం అమలులోకి తేవాలని కూడా భావిస్తోంది. ఈ మేరకు నోటిఫికేషన్ని కూడా జారీ చేసింది.
ఈ నోటిఫికేషన్ ప్రకారం ప్లాస్టిక్ ఫ్లెక్సీల ఉత్పత్తి, దిగుమతి, వినియోగం, ముద్రణ, రవాణా వంటి వాటిని పూర్తిగా ఏపీలో నిషేధిస్తున్నారు. ఇక ఈ నిషేధం ఏపీలో గట్టిగా అమలు కావాలీ అంటే అధికారులదే పూర్తి బాధ్యత అని ప్రభుత్వం స్పష్టం చేస్తోంది. వారే ముందుండి కొరడా పట్టాలని కోరుతోంది.
ఇక ఎవరైనా నిబంధనలను అతిక్రమిస్తే ఫ్లెక్సీకు వేయి రూపాయలు వంతున భారీ జరీమానా విధించాలని కూడా ప్రభుత్వం నిర్ణయించింది. ఇదిలా ఉండగా ఇప్పటికి నలభై రోజుల తరువాత అంటే నవంబర్ 1 నుంచి ఏపీలో ప్లాస్టిక్ ఫ్లెక్సీల నిషేధాన్ని అమలు చేయడానికి నిర్ణయించారు.
అయితే గత నెలలో జగన్ విశాఖ వచ్చినపుడు ఏపీలో జరిగిన ఒక కార్యక్రమంలో మాట్లాడుతూ ఆ రోజు నుంచే ప్లాస్టిక్ ఫ్లెక్సీలను ఏపీ అంతటా నిషేధిస్తున్నట్లుగా ప్రకటించారు. కానీ అవేమీ ఎక్కడా అమలు కాలేదు. పైగా గతంలో మాదిరిగానే పరిస్థితి ఉంది. ఇపుడు కొన్నాళ్ళు ఆగి ప్రభుత్వం నోటిఫికేషన్ కూడా జారీ చేసింది. ఈసారి అయినా సక్సెస్ ఫుల్ గా ప్లాస్టిక్ నిషేధం ఉంటుందా అన్నదే చర్చగా ఉంది.
ఇక ప్లాస్టిక్ ఫ్లెక్సీల నిషేధం మంచి నిర్ణయమే కానీ దీని మీద ఆధారపడి చాలా మంది చిన్న వ్యాపారులు బతుకుతున్నారు. వారి సంగతి ఏమిటన్నది ఆలోచించకుండా సడెన్ గా నిషేధం అంటే వారు రోడ్డున పడతారు. మరో వైపు చూస్తే ప్రభుత్వం వారికి వేరే రకంగా ఉపాధి చూపించాలని డిమాండ్ ఉంది. ఇక గుడ్డ ఫ్లెక్సీలు అంటే అవి ఖరీదైన వ్యవహారంగా ఉందని అందరూ అంటున్నారు. మరి ఏ రకంగా ప్లాస్టిక్ ఫ్లెక్సీల నిషేధం అమలు అవుతుందో చూడాల్సి ఉంది.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.