Begin typing your search above and press return to search.

కరోనా ఎఫెక్ట్ : బెంగళూరు లో మూతపడ్డ స్కూల్స్ !

By:  Tupaki Desk   |   9 March 2020 9:36 AM GMT
కరోనా ఎఫెక్ట్ : బెంగళూరు లో మూతపడ్డ స్కూల్స్ !
X
కరోనా వైరస్ ..కరోనా వైరస్ కారణంగా ప్రపంచ దేశాలన్ని వణికిపోతున్నాయి. ఈ కరోనా వైరస్ పేరు వినబడితే చాలు ప్రజలు భయపడిపోతున్నారు. రోజురోజుకీ ఈ వ్యాధిగ్రస్తులు పెరిగిపోతున్నారు. ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా కొంతమందికి కరోనా వైరస్ లక్షణాలు కనిపిస్తున్నాయి. ఈ వైరస్‌ చైనాలో కాస్త తుగ్గముఖం పట్టినప్పటికి ఇతర దేశాల్లో మాత్రం ఈవైరస్‌ తో మృతుల సంఖ్య పెరుగుతుంది. ఇరాన్‌ లో కరోనాతో ఒక్క రోజే 49 మంది మృతి చెందారు.

ఇకపోతే ఇప్పుడిప్పుడే భారత్ లో ఈ కరోనా కలకలం రేగుతోంది. ఇప్పటివరకు మన దేశంలో 40 వరకు కరోనా పాజిటివ్ కేసులు నమోదైయ్యాయి. అలాగే తెలుగు రాష్ట్రాలైన తెలంగాణ , ఆంధ్రప్రదేశ్ లో కరోనా అనుమానిత కేసులు రోజురోజుకి పెరిగిపోతున్నాయి. ఇంకా తెలుగు రాష్ట్రాలలో ఒక్కటి కూడా పాజిటివ్ కరోనా కేసు లేకపోయినప్పటికీ ..అనుమానితుల సంఖ్య పెరుగుతుండటంతో అందరిలో ఆందోళన మొదలైంది.

ఈ నేపథ్యంలోనే కర్ణాటక ప్రభుత్వం బెంగళూర్‌ లో ప్రాథమిక విద్యా పాఠశాలలకు సెలవలు ఇవ్వాలని ఉత్తర్వులు జారీ చేసింది. కర్ణాటక హెల్త్‌ కమిషనర్‌ పంకజ్‌ కుమార్‌ పాండే సూచనల తో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. సరిహద్దు రాష్ట్రాలలో కరోనా అనుమానిత కేసులు ఎక్కువగా నమోదు అవుతున్న నేపథ్యంలో కర్ణాటక ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. వైద్యారోగ్య శాఖ సిఫార్సులకు అనుగుణంగా బెంగళూర్‌ నార్త్‌, సౌత్‌, గ్రామీణ జిల్లాల్లో కేఎజ్‌జీ, యూకేజీ తరగతులకు సెలవలు ప్రకటిస్తున్నామని కర్ణాటక ప్రాథమిక విద్యా శాఖ మంత్రి ఎస్‌ సురేష్‌ కుమార్‌ ట్వీట్‌ చేశారు. కరోనా వ్యాప్తిని అడ్డుకునే క్రమంలో బెంగళూర్‌ నగరంలో తక్షణమే ప్రీకేజీ, ఎల్‌ కేజీ, యూకేజీ తరగతులను మూసి వేయాలని హెల్త్‌ కమిషనర్‌ పాండే రాష్ట్ర ఆరోగ్య ,కుటుంబ సంక్షేమ శాఖ ప్రిన్సిపల్‌ కార్యదర్శి ఎస్‌ఆర్‌ ఉమాశంకర్‌ కు లేఖ రాశారు.