Begin typing your search above and press return to search.
బిగ్ బ్రేకింగ్ :మే 15 వరకు స్కూళ్ళు - కాలేజీలు మూసివేత?
By: Tupaki Desk | 8 April 2020 7:50 AM GMTకరోనా వైరస్ ను దేశంలో అరికట్టడానికి విధించిన లాక్ డౌన్ గడువు ఏప్రిల్ 14 తో ముగియబోతుంది. కానీ, కరోనా వైరస్ మాత్రం దేశంలో ఇంకా పెరుగుతూనే ఉంది తప్ప - ఎక్కడా తగ్గుముఖం పట్టినట్టు కనిపించడం లేదు. అలాగే గత వారం రోజుల్లో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య కూడా భారీగా పెరుగుతుంది. ఈ నేపథ్యంలో లాక్ డౌన్ ను ఎత్తివేస్తే మరింతగా కరోనా విజృంభించే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో లాక్ డౌన్ ను ఎత్తివేస్తారా ...లేఖ పొడగిస్తారా అన్న సందేహాల నడుమ కేంద్ర మంత్రి బృందం ఒక కీలక ప్రతిపాదన చేసింది.
అదేమిటి అంటే ...దేశంలో అన్ని విద్యాసంస్థలను మరో 4 వారాల పాటు మూసి వేయాలని సూచించింది. కరోనా వైరస్ కేసులు పెరుగుతుండడంతో.. లాక్ డౌన్ పొడిగించాలని తెలంగాణ - మహారాష్ట్ర - తమిళనాడు - యూపీ సహా వివిధ రాష్ట్ర ప్రభుత్వాలు కేంద్రాన్ని కోరుతున్నాయి. ఈ నేపథ్యంలో లాక్ డౌన్ ను ఎత్తివేసినా - లేకపోయినా కూడా స్కూళ్ళు - కాలేజీలను నాలుగు వారాల పాటు మూసివేయాలని ఈ బృందం అభిప్రాయపడింది.
అలాగే సమ్మర్ కూడా ప్రారంభమైంది. ఈ సమయంలో ఎక్కువగా ప్రార్థనా కేంద్రాలు - మతపరమైన కూడళ్ల వద్ద పెద్ద సంఖ్యలో జనం గుమికూడతారు. అలా జనం గుమికూడకుండా చూసేందుకు డ్రోన్లను వినియోగించాలని ఈ బృందం సిఫారసు చేసింది. ఏప్రిల్ 14 తరువాత నాలుగు వారాల పాటు షాపింగ్ మాల్స్ కూడా మూసివేయాలని కూడా అభిప్రాయపడినట్టు తెలుస్తోంది. రక్షణ శాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్ అధ్యక్షతన జరిగిన సమావేశంలో హోమ్ మంత్రి అమిత్ షా - ఆర్ధిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ పాల్గొన్నారు. ఇకపోతే వరల్డ్ ఓ మీటర్ ప్రకారం భారత్ లో కరోనా కేసుల సంఖ్య ..5,356 గా ఉంది. 160 మంది కరోనా రోగులు మృతి చెందారు.