Begin typing your search above and press return to search.
కరోనా సోకిన వారి రక్తం జిగురులా మారిందా? శాస్త్రవేత్తలు చెబుతున్నదేమిటి?
By: Tupaki Desk | 27 Oct 2020 11:50 AM GMTకరోనా మహమ్మారి ఇప్పటికే ఎంతో మందిని బలితీసుకున్నది. కొంతమందికి సాధారణ మందులతో తగ్గుతోంది. మరికొందరికి ఆస్పత్రికి వెళ్తే కానీ నయం కావడం లేదు. ఇంకొందరు మాత్రం ప్రాణాలు కోల్పోతున్నారు. ఈ వైరస్ చాలా మంది జీవితాలను అతలాకుతలం చేసింది. మానవ చరిత్రలో ఎన్నో వైరస్లు, రోగాలు వచ్చిపడ్డాయి. కానీ జనాన్ని ఇంతగా కాల్చుకుతిన్న వైరస్ మాత్రం కరోనానే కావచ్చు. కరోనావైరస్ మన ఊపిరితిత్తులను, గాలి మార్గాలను దెబ్బతీస్తుంది.. అయితే ఇమ్యూనిటీ పవర్ ఉన్నవాళ్లు తట్టకుంటున్నారు. కరోనా ఉన్నవాళ్లను గుర్తించడం చాలా కష్టమని.. వాళ్లు సాధారణంగానే ఉండి మనకు వైరస్ అంటించి పోతున్నారని కేంబ్రిడ్జ్కు చెందిన శాస్త్రవేత్తలు అంటున్నారు.
సాధారణంగా ఏదైనా వైరస్ మన శరీరంలోని కణాలను హైజాక్ చేయగానే అవి 'ఇంటర్‌ఫెర్నోస్' అనే రసాయనాలను విడుదల చేయడం ప్రారంభిస్తాయి. ఇలా చేస్తూ మిగతా శరీరానికి, రోగనిరోధక వ్యవస్థకు ప్రమాద సంకేతాలను పంపిస్తాయి. "అయితే, కరోనావైరస్‌కు ఈ రసాయనాలు విడుదల కాకుండా ఆపగలిగే శక్తి ఉంది. దీనివలన శరీరానికి వైరస్ సోకినట్టు రోగ నిరోధక వ్యవస్థ గుర్తించదు. "కోవిడ్ సోకిన కణాలను ప్రయోగశాలలో పరీక్షిస్తే వాటికి వైరస్ సోకిందో లేదో కనిపెట్టలేం. మనుషులకు సోకే కరోనావైరస్‌లలో సాధారణ జలుబుతో మొదలయ్యే మరో నాలుగు రకాలు కూడా ఉన్నాయి.
"అయితే, ప్రస్తుత కోవిడ్ 19 వీటన్నిటికన్నా భిన్నమైనది. కొత్తది. దీన్ని ఎదుర్కోవడానికి కావలసిన రోగనిరోధక వ్యవస్థ మనకు ఉందని నేననుకోను" అని యూనివర్సిటీ ఆఫ్ మాంచెస్టర్‌కు చెందిన ట్రాసీ హసెల్ తెలిపారు. కోవిడ్ రోగుల రక్తంలో గడ్డ కట్టిన రసాయనాలు సాధారణ స్థాయి కన్నా 200 నుంచి 400 శాతం ఎక్కువగా ఉంటున్నాయని కింగ్స్ కాలేజ్ ఆఫ్ లండన్‌కు చెందిన ప్రొఫెసర్ బెవర్లీ హంట్ చెప్పారు. "నా కెరీర్ మొత్తంలో ఇలాంటి జిగటతో కూడిన రక్తాన్ని రోగులలో ఇంతవరకూ చూడలేదు" అని ఆమె 'ఇన్సైడ్ హెల్త్'తో చెప్పారు. కరోనా వైరస్ చాలా భయానకమైనదని పలువురు శాస్త్రవేత్తలు చెబుతున్నారు.