Begin typing your search above and press return to search.
షాకింగ్.. లో దుస్తుల అమ్మకాలు తగ్గిపోవడం ఆర్థిక మాంద్యానికి సూచనా?
By: Tupaki Desk | 14 Nov 2022 3:20 AM GMTమన ఆర్థిక వ్యవస్థ పరిస్థితులు ఇటీవల బాగా లేవని ఆర్థిక నిపుణులు చెబుతున్నారు. ద్రవ్యోల్బణం పెరుగుతోంది. ఆర్థిక మందగమనంతోపాటు ఆర్థిక మాంద్యం తప్పదని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
ప్రపంచ బ్యాంక్ సైతం భారత్ వృద్ధిరేటును 2022–23 కోసం 8.7 శాతం నుంచి 7.5 శాతానికి తగ్గించింది. కేవలం మన దేశం మాత్రమే కాకుండా
ప్రపంచంలోని ప్రధాన ఆర్థిక వ్యవస్థలన్నీ ఆర్థిక మాంద్యంలోకి ప్రవేశిస్తాయని భావిస్తున్నారు.
చాలా మంది ఆర్థికవేత్తలు ఆర్థిక మాంద్యం సమయంలో ప్రజలు ఖరీదైన, అనవసరమైన వస్తువులను తగ్గించుకుంటారని నమ్ముతారు. అమెరికా మాజీ ఫెడరల్ రిజర్వ్ హెడ్ అలాన్ గ్రీన్‌స్పాన్ ఆర్థిక మాంద్యం వచ్చిందనడానికి పురుషుల లోదుస్తులు ఒక ముఖ్యమైన ఆర్థిక సూచిక అని అభిప్రాయపడ్డారు.
లో దుస్తులు (ఇన్నర్‌వేర్స్)ని ఎవరూ చూడరు. అందువల్ల డబ్బులు తక్కువ ఉన్నప్పుడు లో దుస్తులు కొనడానికి ప్రజలు ఇష్టపడరంట. ఎందుకంటే అవి ధరించామా, లేదా అనేది ఎవరూ చూడరు, తెలుసుకోలేరు కాబట్టి.
చేతిలో డబ్బులు తక్కువగా ఉన్నప్పుడు అనవసరమైన వస్తువులను కొనడం ప్రజలు తగ్గించుకుంటారని చెబుతున్నారు. ఇందులో భాగంగా ముఖ్యంగా లో దుస్తులు కొనడం తగ్గించుకుంటారని.. ఉన్నవాటితోనే సరిపెట్టుకుంటారని అంటున్నారు.
దీంతో లో దుస్తులను ఉత్పత్తి చేసే కంపెనీల విక్రయాలు తగ్గిపోతాయి. ఇలా లో దుస్తుల విక్రయాలు తగ్గినప్పుడు ఆర్థిక మాంద్యం వచ్చినట్టు భావిస్తారు.
మనదేశంలో ఈ ఏడాది మార్చిలో లో దుస్తులను తయారుచేసే జాకీ, లక్స్ ఇండస్ట్రీస్ అమ్మకాలు గణనీయంగా పడిపోయాయి. దీన్ని బట్టి మనదేశంలోనూ మాంద్యం ప్రవేశించినట్టేనని చెబుతున్నారు.
కేవలం మనదేశంలోనే కాదు అమెరికాలో 2007–09 మధ్య ఆర్థిక మాంద్యం ఉన్నప్పుడు ఆ దేశంలో సైతం లో దుస్తులు అమ్మకాలు గణనీయంగా పడిపోయాయి.
సాధారణ ఆర్థిక సమయాల్లో లోదుస్తుల అమ్మకాలు గణనీయంగా ఉంటాయట. తాజాగా లో దుస్తులను తయారుచేసే డాలర్ ఇండస్ట్రీస్ ధర తాజాగా స్టాక్ మార్కెట్‌లో భారీగా తగ్గిపోయింది. ఈ ఏడాది సెప్టెంబర్ త్రైమాసికానికి సంబంధించి ఈ కంపెనీ విక్రయాలు భారీగా క్షీణించాయి. ఏకంగా 12.48 శాతం క్షీణించి రూ.341.92 కోట్లకు చేరాయి.
అదేవిధంగా డాలర్ ఇండస్ట్రీస్ కంపెనీ లాభాలు గతేడాది ఇదే సమయంతో పోలిస్తే ఈ ఏడాది ఏకంగా 60.49 శాతం క్షీణించి రూ.17.29 కోట్లకు పడిపోయాయి. దీంతో ఇన్వెస్టర్లు ఆ షేర్లను అమ్మేస్తున్నారు. ఈ శుక్రవారం నేషనల్ స్టాక్ ఎక్సేంజ్‌లో షేరు ధర 6.72 శాతం నష్టంతో రూ.452 వద్ద ముగిసింది.
లో దుస్తుల విక్రయాలు క్షీణించడంతో ఆర్థిక మాంద్యం మన దేశంలోకి ప్రవేశించినట్టేనని ఆర్థిక నిపుణులు భావిస్తున్నారు. ఇదే సూత్రాన్ని లిప్‌స్టికులకు కూడా వర్తింప జేస్తున్నారు. చేతిలో డబ్బులు తక్కువగా ఉన్నప్పుడు మహిళలు లిప్‌స్టిక్కులను కొనుగోలు చేయరట. లిప్‌స్టిక్ విక్రయాలు తగ్గినా ఆర్థిక మాంద్యానికి సూచికగానే పరిగణిస్తారు.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.