Begin typing your search above and press return to search.
బిగ్ బ్రేకింగ్ : సీఎం యడ్యూరప్ప రాజీనామా !
By: Tupaki Desk | 26 July 2021 6:53 AM GMTకర్ణాటక ముఖ్యమంత్రి యడియూరప్ప తన పదవికి రాజీనామా చేశారు. ముఖ్యమంత్రి పదవి నుంచి యడియూరప్ప ను తొలగిస్తున్నారనే ప్రచారం గత కొన్ని రోజులుగా పెద్ద ఎత్తున సాగుతున్న సంగతి తెలిసిందే. అందరూ ఊహించినట్టే , గత కొన్ని రోజులుగా వస్తున్న వార్తలని నిజం చేస్తూ నేడు యడియూరప్ప తన సీఎం పదవికి రాజీనామా చేశారు. కేంద్ర నాయకత్వం సూచన మేరకు ఆయన రాజీనామా చేసినట్లు చర్చ జరుగుతోంది. ముఖ్యమంత్రిగా రెండు సంవత్సరాల కాలం పూర్తి చేసుకున్న ఆయనను రాజీనామా చేయాలని బీజేపీ కేంద్ర నాయకత్వం కోరినట్లు తెలుస్తోంది. సీఎంగా రెండు సంవత్సరాలు పూర్తి చేసుకున్న రోజునే ఆయన రాజీనామా చేశారు. సాయంత్రం నాలుగు గంటలకు యడ్యూరప్ప గవర్నర్ కు తన రాజీనామా లేఖను ఇవ్వనున్నారు.
ఈ నేపథ్యంలో తన ప్రభుత్వ రెండేళ్ల పాలనపై బెంగళూరులో ఈరోజు జరిగిన సమావేశంలో యడియూరప్ప మాట్లాడుతూ, తీవ్ర ఉద్వేగానికి లోనయ్యారు. అటల్ బిహారీ వాజ్ పేయి ప్రధానిగా ఉన్నప్పుడు కేంద్ర మంత్రిగా ఉండాలని తనను అడిగారని... కానీ, తాను కర్ణాటకలోనే ఉంటానని ఆయనకు చెప్పానని అన్నారు. ఆ తర్వాత కర్ణాటలో బీజేపీ క్రమంగా బలం పుంజుకుంటూ వచ్చిందని చెప్పారు. తనకు ఎప్పుడూ అగ్ని పరీక్షే ఎదురవుతుంటుందని ఆయన భావోద్వేగానికి గురయ్యారు. ఈ రెండేళ్లు కరోనాతోనే సరిపోయిందని అన్నారు. తన రెండెళ్ల పాలనపై యడ్యూరప్ప మాట్లాడుతూ కన్నీటిపర్యంతం అయ్యారు. నాలుగోసారి సీఎంగా పదవి చేపట్టిన ఆయన ఏ ఒక్కసారి కూడా ఐదేళ్ల పదవీకాలాన్ని ఆయన పూర్తి చేయలేకపోయారు. ఈ సాయంత్రమే బీజేపీ అధినాయకత్వం కొత్త సీఎం పేరును ఖరారు చేయనుంది.