Begin typing your search above and press return to search.
బూతులు మింగేయండీ సీఎం గారు!
By: Tupaki Desk | 11 May 2018 8:05 AM GMTచంద్రబాబు... తరచూ చెప్పే మాట ఏంటంటే... ఓపిక ఉండాలి, ఏం మాట్లాడుతున్నారు? అంటుంటారు. ఇవి ఆయన ఊతపదాలు. 40 ఏళ్ల అనుభవాన్ని చెప్పి అందరికీ క్లాసులు చెప్పడానికి మాత్రమే ఆయన అనుభవాన్ని వాడే ఏపీ ముఖ్యమంత్రి గారిలో ఎందుకో ఈ మధ్యలో నిరాశ తారాస్థాయికి చేరినట్టు అనిపిస్తుంది. ఇంతకాలం ఎవరైనా విమర్శలు చేస్తే కేవలం కోప్పడేవారు. కానీ ఇపుడు బూతులు మాట్లాడుతున్నారు. ఇంతకీ ఏం జరిగిందంటే..
గురువారం చంద్రబాబు కర్నూలు జిల్లాల్లో కొన్ని శంకుస్థాపనలు చేశారు. అందులో ఒకటి ఒక స్టీల్ ప్లాంట్ శంకుస్థాపన. ఎప్పటిలాగానే ఆయన గొప్పలు చెప్పుకున్నారు. కర్నూలులో భవిష్యత్తులో 80 వేల ఉద్యోగాలు కల్పిస్తామన్నారు. అయితే, ఆయన ప్రారంభించిన ప్లాంట్ పూర్తయితే వచ్చే ఉద్యోగాల సంఖ్య మూడు వేలు అని ఆయనే చెప్పారు. మరి ఆ 80 వేలు ఎక్కడివో బాబు గారికే తెలియాలి. చంద్రబాబు ఇలాంటి శంకుస్థాపనలు ఈ మధ్య విరివిగా చేస్తున్నారు. అయితే, ఈ శంకుస్థాపనలపై ప్రతిపక్ష పార్టీలు మాట్లాడుతూ శంకుస్థాపనలకే పరిమితమా.. ఏదైనా కార్యరూపం దాల్చే అవకాశం ఉందా అన్న దానికి నిన్న సభలో చంద్రబాబు వాళ్లు *ఏం పీకారు* చాలా *సంస్కారవంతంగా* సమాధాన మిచ్చారు.
చంద్రబాబు వంటి అనుభజ్ఞుడు మాట్లాడాల్సిన మాటలేనా ఇవి? పోనీ ఒక ముఖ్యమంత్రి హోదాలో ఉన్న వ్యక్తి మాట్లాడాల్సిన మాటలా ఇవి? గతంలో సోషల్ మీడియాలో కొందరు బి గ్రేడ్ అభిమానులు మాట్లాడినట్లున్నాయి ఈ కామెంట్లు. అయినా, కులాల వారీగా మనుషులను సంబోధించే మనిషి ఇలా మాట్లాడితే ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. ఎస్సీల్లో ఎవరు పుట్టాలనుకుంటారు అని కామెంట్ చేసిన పెద్దాయన చంద్రబాబు. నిన్న ఆయనను ఆదర్శంగా తీసుకుని వర్ల రామయ్య ఏమన్నాడో విన్నారుగా... అందరికీ నీతులు చెప్పే బల్లి కుడితిలో పడ్డట్టుంది చంద్రబాబు పరిస్థితి.
వీడియో చూడటానికి క్లిక్ చేయండి