Begin typing your search above and press return to search.
క్రైస్తవ సోదరులకు సీఎం క్రిస్మస్ విందు !
By: Tupaki Desk | 19 Dec 2019 10:30 AM GMTక్రిస్మస్‌ను పురస్కరించుకొని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తరఫున శుక్రవారం క్రైస్తవ సొందరులకి విందుని ఇవ్వబోతుంది. ఈ విందుకు ఏర్పాట్లు పకడ్బందీగా జరుగుతున్నాయని మైనార్టీ, ఎస్సీ అభివృద్ధిశాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ చెప్పారు. లాల్ బహదూర్ స్టేడియంలో ఏర్పాట్లను ఆయన పరిశీలించారు. అనంతరం అధికారులతో సమీక్ష నిర్వహించిన మంత్రి మీడియాతో మాట్లాడారు. ప్రభుత్వం ఐదేళ్లుగా క్రిస్మస్ విందు నిర్వహిస్తున్నదని, దీనికి సీఎం కేసీఆర్ స్వయంగా హాజరవుతున్నారని తెలిపారు. విందు కార్యక్రమాన్ని 14 శాఖలు సమన్వయంతో పనిచేసి విజయవంతం చేయాలని సూచించారు.
ఇకపోతే , ప్రభుత్వం ఇచ్చే ఈ విందుకి సీఎం తో పాటుగా పలువురు మంత్రులు కూడా పాల్గొననున్నారు. ఈ విందుకు దాదాపు 10 వేల మంది క్రైస్తవులు హాజరుకానున్నారని సమాచారం. అలాగే.. క్రిస్మస్ పర్వదినాన్ని పురస్కరించుకుని రెండు లక్షల క్రైస్తవ కుటుంబాలకు దుస్తులు పంపిణీ చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించిన విషయం విదితమే. ఇప్పటికే పలు చర్చీల్లో దుస్తుల పంపిణీ జరుగుతోంది. క్రిస్టియన్ మైనార్టీ ఫైనాన్స్ కార్పొరేషన్ ఎండీ ఏహెచ్‌ఎన్ కాంతి వెస్లీ బుధవారం ఒక సమావేశంలో మాట్లాడుతూ క్రిస్టియన్ భవన్ నిర్మాణం కోసం కోకాపేట వద్ద రెండెకరాల భూమిని ప్రభుత్వం కేటాయించిందని, క్రైస్తవులశ్మశాన వాటిక కోసం రంగారెడ్డి, మేడ్చల్, వికారాబాద్ జిల్లాల పరిధిలో 40.21 ఎకరాల భూమిని ప్రభుత్వం ప్రతిపాదించినట్టు తెలిపారు.