Begin typing your search above and press return to search.
ఇనుప రాడ్డుతోనే రాత్రంతా మహిళా సీఎం ఇంట్లో ఆగంతకుడు!
By: Tupaki Desk | 12 July 2022 11:30 AM GMTపశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి, తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి మమతా బెనర్జీ ఇంట్లో కొద్ది రోజుల క్రితం హఫీజుల్ మొల్లా అనే ఓ ఆగంతకుడు కలకలం సృష్టించిన సంగతి తెలిసిందే. మమతకు జెడ్ ప్లస్ భద్రత ఉంది. అయినా భద్రతా సిబ్బంది కళ్లు కప్పి ముఖ్యమంత్రి ఇంట్లో ఆగంతకుడు చొరబడ్డాడు. అంతేకాకుండా రాత్రంతా ఇంటిలోనే ఉన్నాడు. ఉదయం 8 గంటల తర్వాత గుర్తు తెలియని వ్యక్తిని సీఎం నివాసం ఆవరణలో చూసి అధికారులు ఉలిక్కిపడ్డారు.
వెంటనే అతడ్ని పోలీస్ స్టేషన్‌కు తరలించారు. అయితే కోల్‌కతా లాల్‌బజార్‌లోని పోలీస్ హెడ్‌క్వార్టర్స్ అనుకొని తాను సీఎం మమతా బెనర్జీ నివాసంలోకి ప్రవేశించినట్లు నిందితుడు తెలిపినట్టు పోలీసులు చెప్పారు.
కాగా పోలీసుల విచారణలో అతడు ఒక్కోసారి ఒక్కో సమాధానం చెబుతున్నాడని పోలీసులు తెలిపారు. మొదట తాను పండ్లు అమ్ముతానని చెప్పాడని, ఆ తర్వాత డ్రైవర్‌నని మాట మార్చాడని పేర్కొన్నారు. కాగా మమతా ఇంటి వద్ద అతడు ఏడు సార్లు రెక్కీ నిర్వహించినట్టు పోలీసుల దర్యాప్తులో తేలింది. అంతేకాకుండా తన సెల్ ఫోన్ తో మమత నివాసాన్ని ఫొటోలు తీశాడని వెల్లడైంది.
కాగా, ఈ నెల 2, 3 తేదీల మధ్య రాత్రి హఫీజుల్.. సీఎం ఇంట్లోని భద్రతా సిబ్బందిని దాటి మమత ఇంట్లోకి ఇనుపరాడ్‌తో ప్రవేశించడాన్ని పోలీసులు గుర్తించారు. అతడి వద్ద 11 సిమ్ కార్డులు ఉన్నాయని తేలింది. నిందితుడు హఫీజుల్ మొల్లా బంగ్లాదేశ్, జార్ఖండ్, బిహార్‌కు చెందిన పలువురికి ఫోన్ చేసినట్టు గుర్తించారు. ఈ క్రమంలోనే నిందితుడు గతేడాది సరైన పత్రాలు లేకుండానే బంగ్లాదేశ్‌కు వెళ్లినట్టు పోలీసులు తెలిపారు.
ఈ ఘటన అనంతరం సీనియర్ పోలీస్ అధికారుల పోస్టింగ్‌ల్లో కోల్‌కతా అధికార యంత్రాంగం పలు మార్పులు చేపట్టింది. మమతా బెనర్జీ ఇంటి వద్ద ఉగ్రవాది ఇలా సంచరించడంతో సీఎం సెక్యూరిటీ డైరెక్టర్ వివేక్ సహాయ్‌ను పదవి నుంచి తొలగించారు. ఇక, నిందితుడు బంగ్లాదేశ్‌కు వెళ్లిన నేపథ్యంలో అక్కడ అతడి కార్యకలాపాలను తెలుసుకునేందుకు ప్రయత్నిస్తున్నట్ట పోలీసులు స్పష్టం చేశారు.
అతడు అక్కడ ఎవరిని కలిశాడు? ఇక్కడకు అతడిని ఎవరు పంపారు అనే కోణంలో విచారిస్తున్నారు. ఈ క్రమంలోనే ఉగ్రవాదులతో హఫీజుల్‌కు సంబంధాలు ఉన్నట్టు పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.