Begin typing your search above and press return to search.

ఆ మీడియాకు కనీస విలువలు లేవా?: జగన్

By:  Tupaki Desk   |   28 Jun 2021 4:30 PM GMT
ఆ మీడియాకు కనీస విలువలు లేవా?: జగన్
X
కరోనాను ఎదుర్కోవడంలో ఏపీ ప్రభుత్వానికి మంచి పేరు వచ్చిందని.. అందుకే ఆ పత్రిక తప్పుడు రాతలు రాస్తూ ప్రభుత్వ ప్రతిష్ట దిగజార్చే కార్యక్రమం చేపట్టిందని సీఎం జగన్ సీరియస్ అయ్యారు. కోవిడ్ నివారణ చర్యలు, వ్యాక్సినేషన్ పై సీఎం జగన్ సోమవారం సమీక్ష నిర్వహించారు. ప్రభుత్వంపై మొదటి పేజీలో ఆ పత్రిక తప్పుడు రాతలు రాస్తూ ప్రజల్లో భయాందోళనలు రేకేత్తిస్తోందని జగన్ ఆరోపించారు.

రాష్ట్రంలో 5 శాతానికి కరోనా కేసులు పడిపోయాయని..70 శాతం ఆక్సిజన్, వెంటీలేటర్ల బెడ్స్ ఖాళీగా ఉన్నాయని.. కరోనాను ఏపీలో నియంత్రించామని.. కానీ ఆ పత్రిక ఆక్సిజన్ అందక ఏపీలో ముగ్గురు చనిపోయారని బ్యానర్ గా మొదటి పేజీలో రాయడం ఏంటని సీఎం జగన్ ప్రశ్నించారు. అసలు వీరికి విలువలు లేవా? ప్రభుత్వానికి మంచి పేరు వస్తుందనే ఇలా తప్పుడు రాతలు రాస్తారా? వీరిని నియంత్రించే వారే లేరా అని జగన్ ప్రశ్నించారు.

ఆక్సిజన్ కొరతతో రోగులు చనిపోతున్నారని తప్పుడు రాతలు రాస్తున్నారని జగన్ ఆరోపించారు. కనీస విలువలు పాటించకుండా తప్పుడు రాతలు రాస్తున్నారని ఆరోపించారు. ముఖ్యమంత్రి పదవి స్థాయిని దిగజార్చడమే వారి ఉద్దేశం అని అన్నారు.

మనసులో కుళ్లు కుతంత్రాలతో ఆక్సిజన్ కొరతతో చనిపోతున్నారని రాస్తున్నారని జగన్ మండిపడ్డారు. ఏపీ ప్రభుత్వానికి, అధికారులకు పేరు రాకుండా చేస్తున్నారని.. మన తపన, కృషిని దిగజార్చుతూ తప్పుడు కథనాలు రాస్తున్నారని జగన్ అన్నారు.

ఇంత మంది ఆఫీసర్లకు టైంపాస్ కాకుండా కూర్చుంటున్నామా? కరోనా వేళ ప్రభుత్వానికి మంచి పేరు వస్తుందని ఆ పత్రిక ఇలా రాయడం తప్పు అని జగన్ అన్నారు.