Begin typing your search above and press return to search.
పార్టీ నేతలు ఇద్దరిని కలిపి పెళ్లి పెద్దగా మారిన సీఎం జగన్
By: Tupaki Desk | 23 Nov 2021 5:36 AM GMTఏపీ అధికారపక్షమైన వైసీపీకి చెందిన ఇద్దరు నేతల కుటుంబాలు వియ్యం అందుకున్న సంగతి తెలిసిందే. ఆ మాటకు వస్తే రాజకీయంగా ప్రత్యర్థులైన వారి మధ్య కూడా పెళ్లిళ్లు జరుగుతుంటాయి. ఇదంతా కామనే అయినా.. తాజాగా జరిగిన పెళ్లి మాత్రం సమ్ థింగ్ స్పెషల్ గా అభివర్ణిస్తున్నారు.
వైసీపీకి చెందిన ఇద్దరు నేతల మధ్య వియ్యానికి ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కీలక భూమిక పోఫించినట్లుగా చెబుతున్నారు. ఆసక్తికరంగా మారిన ఈ ఉదంతలోకి వెళితే..
వైసీపీ నేతలు కమ్ ఎమ్మెల్యేలు అయిన కొలుసు పార్థసారధి.. బుర్ర మధుసూదన్ యాదవ్ ల కుటుంబాల మధ్య ముడిపడిన పెళ్లి బంధం వెనుక సీఎం జగన్ పెళ్లికి పెద్దగా వ్యవహరించినట్లుగా చెబుతున్నారు.
కృష్ణాజిల్లా పెనమలూరు ఎమ్మెల్యేగా వ్యవహరిస్తున్న కొలుసు పార్థసారధి.. ఆ మధ్యన తన కుమారుడు నితిన్ ను సీఎం జగన్ వద్దకు తీసుకొచ్చారని చెబుతారు. వచ్చేఎన్నికల్లో పార్టీ తరఫున ప్రచారం చేయటానికి సిద్ధంగా ఉన్నట్లుగా చెప్పటం.. ఆ సందర్భంలో వ్యక్తిగత విషయాలు వారి మధ్య చర్చకు వచ్చినట్లుగా చెబుతున్నారు.
అదే సమయంలో తన కుమారుడికి ఇంకా పెళ్లి కాలేదని పార్థసారధి సీఎం జగన్ కు చెప్పారు. ఆ తర్వాతి రోజుల్లో ప్రకాశం జిల్లా కనిగిరి ఎమ్మెల్యేగా వ్యవహరిస్తున్న బుర్రా మధుసూదన్ యాదవ్.. ఇటీవల కాలంలో పార్టీ కార్యక్రమాలకు సరిగా హాజరు కాకపోవటంపై చర్చ వచ్చింది.
ఆయన కుమార్తెకు పెళ్లి చేసే పనుల్లో బిజీగా ఉన్నారన్న మాట జగన్ చెవిన పడింది. ఈ నేపథ్యంలో ఒకే సామాజిక వర్గమైన ఈ ఇద్దరు ఎమ్మెల్యేల పిల్లలకు పెళ్లి చేస్తే ఎలా ఉంటుందన్న ఆలోచన జగన్ కు రావటం.. వారిని కలిపి మాట్లాడుకోవాలని చెప్పటంతో.. ఇరు వర్గాల సమ్మతితో తాజాగా పెళ్లి జరిగింది.
విజయవాడలో భారీ ఎత్తున జరిగిన ఈ వివాహ వేడుకకు ముఖ్యమంత్రి. జగన్మోహన్ రెడ్డి హాజరయ్యారు. కొలుసు.. బుర్రాల ఫ్యామిలీలు వియ్యం అందుకోవటంలో సీఎం జగన్మోహన్ రెడ్డి కీ రోల్ ప్లే చేశారన్న మాట పలువురి నోట వినిపిస్తోంది.