Begin typing your search above and press return to search.

సీఎం జగన్ క్యాంప్ ఆఫీసు ఇక్కడే?

By:  Tupaki Desk   |   4 Jan 2020 5:05 AM GMT
సీఎం జగన్ క్యాంప్ ఆఫీసు ఇక్కడే?
X
విశాఖను పరిపాలన రాజధానిగా అనుకుంటున్న వైసీపీ సర్కారు ఈ మేరకు చకచకా ఏర్పాట్లు చేసుకుంటున్నట్టు తెలుస్తోంది. తాజాగా సీఎం ముఖ్యకార్యదర్శి ప్రవీణ్ ప్రకాష్ విశాఖ టూర్లో పలు ప్రభుత్వ స్థలాలను పరిశీలించడం చర్చనీయాంశంగా మారింది. సీఎం క్యాంప్ ఆఫీసును ఎక్కడపెట్టాలి.. ఖాళీ ప్రభుత్వ భవనాల గురించి వివరాలు తెప్పించుకున్నారు. దీంతో ప్రభుత్వం విశాఖకు రాజధానిని మార్చడం ఖాయమన్న ప్రచారం మొదలైంది.

సీఎం జగన్ విశాఖ కు పరిపాలన రాజధానిని మరో నాలుగు నెలల్లోనే తరలించడానికి రెడీ అవుతున్నట్లు తెలుస్తోంది. ఈ మేరకు సచివాలయాన్ని రుషికొండ సమీపంలో ఉన్న ఐటీ మిల్స్ భవనాలను పరిశీలిస్తున్నారు. ఇక్కడి భారీ బిల్డింగులు సచివాలయానికి సరిపోతాయని భావిస్తున్నారు.

ఇక భీమిలీ నడిబొడ్డున ఉన్న విశాలమైన జ్యూట్ మిల్లు మూతపడి ఉంది. అందులోని ప్రైవేట్ గెస్ట్ హౌస్ కూడా ఖాళీ ఉందట.. దీన్ని తీసుకొని ఆధునీకరిస్తే ముఖ్యమంత్రి క్యాంప్ ఆఫీస్ గా సరిగ్గా సరిపోతుందని అధికారులు అంచనావేస్తున్నట్టు తెలుస్తోంది. భీమిలి-విశాఖ మధ్యలో ఖాళీగా ఎన్నో భవనాలు ఖాళీగా ఉండడంతో సచివాలయ ఉద్యోగులకు వసతి కల్పించవచ్చని ప్రభుత్వం భావిస్తోంది. సీఎం ముఖ్య కార్యదర్శి ప్రవీణ్ ప్రకాష్ పర్యటనతో రాజధాని తరలింపు పనుల్లో వేగం చోటుచేసుకుంది.