Begin typing your search above and press return to search.
నువ్వు నేర్పిన విలువలే నా ఆస్తి .. సన్ అఫ్ వైఎస్ఆర్ : సీఎం జగన్ భావోద్వేగ ట్వీట్
By: Tupaki Desk | 8 July 2021 9:56 AM GMTఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి , దివంగత నేత డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి జయంతి ఈ రోజు.ఆ మహానేత వైఎస్‌ఆర్ 72వ జయంతి నేడు డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి జయంతిని పురస్కరించుకొని రెండు తెలుగు రాష్ట్రాల్లో అభిమానులు వేడుకల్ని ఘనంగా నిర్వహిస్తున్నారు. తెలుగు ప్రజలకు ఆయన అందించిన సేవలు గుర్తుకు తెచ్చుకుంటున్నారు. ఆరోగ్య శ్రీ , ఫీరీయింబర్స్ మెంట్ వంటి ఎన్నో గొప్ప గొప్ప పథకాల్ని తీసుకువచ్చి సామాన్యుల ను సైతం పెద్ద హాస్పిటల్స్ లో వైద్యం, పెద్ద పెద్ద చదువులు చదివేలా చేశారు. అయన జయంతి ఏపీ వ్యాప్తంగా వైఎస్ఆర్సీపీ కార్యకర్తల, అభిమానులు ఆయనకు ఘనంగా నివాళులర్పిస్తున్నారు.
ఈ నేపథ్యంలో వైఎస్ రాజశేఖర్ రెడ్డి తనయుడు, వైసీపీ అధినేత ఆంధ్రప్రదేశ్ ప్రస్తుత ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ట్విట్టర్ వేదికగా తన తండ్రికి నివాళులర్పించారు. తన తండ్రి గురించి వివరిస్తూ..ఓ భావోద్వేగపు ట్వీట్ చేశారు. చెదరని చిరునవ్వే నువు పంచిన ఆయుధం పోరాడే గుణమే నువు ఇచ్చిన బలం మాట తప్పని నైజం నువు నేర్పిన పాఠం నీ ఆశయాలే నాకు వారసత్వం ప్రజల ముఖాల్లో విరిసే సంతోషంలో నిను చూస్తున్నా పాలనలో ప్రతిక్షణం నీ అడుగుజాడను స్మరిస్తూనే ఉన్నా.. జన్మదిన శుభాకాంక్షలు నాన్నా అంటూ జగన్ ట్వీట్ చేశారు.
ప్రస్తుతం ఈ ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. మరోవైపు ఈరోజు రాయలసీమలో పర్యటిస్తున్న జగన్ మధ్యాహ్న సమయంలో ఇడుపులపాయలోని వైఎస్ సమాధి వద్ద నివాళులర్పించనున్నారు. రువారం ఉదయం అనంతపురం జిల్లా రాయదుర్గం వెళ్లిన ఆయన.. అక్కడ రైతు భరోసా కేంద్రాన్ని ప్రారంభించారు. అక్కడ నుంచి కడప జిల్లా లో పలు అభివృద్ధి కార్యక్రమాలకి శంకుస్థాపన చేసి అనంతరం సాయంత్రం ఇడుపుల పాయలోని వైఎస్ ఆర్ ఘాట్ కు చేరుకొని ప్రత్యేక ప్రార్ధనల్లో పాల్గొంటారు. మరోవైపు ఇడుపులపాయలో వైఎస్ రాజశేఖర్ రెడ్డికి ఆయన కుటుంబ సభ్యులు అభిమానులు నివాళులర్పించారు. ఉదయం వైఎస్ విజయమ్మ, వైఎస్ షర్మిల ఇతర కుటుంబ సభ్యులు ప్రత్యేక ప్రార్ధనలు చేశారు. అదే సమయంలో వైఎస్ షర్మిల స్థాపించబోయే కొత్త రాజకీయ పార్టీకి సంబంధించిన జెండాను వైఎస్ సమాధి వద్ద ఉంచి ఆశీర్వాదం తీసుకున్నారు. ఆ తరవాత సీఎం జగన్ సతీమణి వైఎస్ భారతి నివాళులు అర్పించారు. ఇక రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న జయంతి వేడుకల్లో మంత్రులు, ఎమ్మెల్యేలు, ఇతర ముఖ్యనేతలు పాల్గొని నివాళులర్పించారు.
యెడుగూరి సందింటి రాజశేఖరరెడ్డి... తెలుగు ప్రజల మనసుల్లో స్థిరస్థాయిగా నిలిచిపోయే మహానేత. 2004-09 కాలంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌కు ముఖ్యమంత్రిగా పదవీ బాధ్యతలు చేపట్టి ప్రజారంజక పాలన అందించారు. కేవలం ఐదేళ్ల కాలంలోనే ఆయన తనదైన పాలనతో తెలుగు ప్రజల జీవితాలపై చెరగని ముద్రను వేసుకున్నారు. 2003లో మండువేసవిలో సుమారు 1467 కిలోమీటర్ల పాదయాత్ర చేపట్టిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని అధికారంలో తీసుకొచ్చారు. 2004లో సీఎంగా బాధ్యతలు చేపట్టిన ఆయన అనేక రైతులకు ఉచిత విద్యుత్ అందించే ఫైలుపై తొలి సంతకం చేశారు. ఆరోగ్య శ్రీ, ఫీజ్ రీయింబర్స్‌మెంట్, 18 అంబులెన్స్ సేవలు లాంటి అనేక ప్రజా సంక్షేమ పథకాలని తీసుకువచ్చారు. ఆయన 1949 జూలై 8న జయమ్మ, రాజారెడ్డి దంపతులకు కడప జిల్లా జమ్మలమడుగులోని సి.ఎస్.ఐ. కాంప్‌బెల్ మిషన్ ఆసుపత్రిలో జన్మించారు. కర్ణాటకలోని గుల్బర్గాలో మెడిసిన్ చదిచిన ఆయన తిరుపతిలోని శ్రీ వెంకటేశ్వర వైద్యకళాశాల నుంచి హౌస్ సర్జన్ పట్టా పొందారు. రాజకీయాల్లోకి రాక ముందు వైఎస్ 1973లో తన తండ్రి పేరిట 70 పడకల చారిటబుల్ హాస్పిటల్ ఏర్పాటు చేశారు.వైఎస్ రాజశేఖర్‌రెడ్డి 1978లో తొలిసారి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. ఎంపీగా నాలుగుసార్లు, ఎమ్మెల్యేగా ఆరుసార్లు ఎన్నికయ్యారు. ఓటమి ఎరుగని నేతగా ఆయనకు పేరుంది. వైఎస్ పాదయాత్ర కారణంగా 2004 ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్‌లో కాంగ్రెస్ పార్టీ ఘనవిజయం సాధించి అధికారంలోకి వచ్చింది. మే 14న ఆయన ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. ప్రజా పాలనా అందించడం తో 2009లో మరోసారి ఆయన ముఖ్యమంత్రి పీఠాన్ని అధిష్టించారు. అదే ఏడాది సెప్టెంబర్ 2న రచ్చబండ కార్యక్రమం కోసం హెలికాప్టర్లో ఆయన బయలుదేరారు. మార్గమధ్యలో ప్రతికూల వాతావరణం కారణంగా ఆ హెలికాప్టర్ ప్రమాదానికి గురైంది. ఈ ప్రమాదంలో వైఎస్ ప్రాణాలు కోల్పోయారు.