Begin typing your search above and press return to search.

సీఎం జగన్ లక్కీ.. కరోనా కాటునుంచి తృటిలో మిస్

By:  Tupaki Desk   |   30 March 2020 12:10 PM GMT
సీఎం జగన్ లక్కీ.. కరోనా కాటునుంచి తృటిలో మిస్
X
తెలంగాణలో పెరుగుతున్న కరోనా రోగులు చూసి ఏపీ లో పెరగడం లేదని కొద్దిగా సంతోష పడ్డారు. కానీ ఇప్పుడు ఢిల్లీ లో మీటింగ్ కు వెళ్లి వచ్చిన వ్యక్తులతోపాటు వైసీపీ ఎమ్మెల్యేకు కరోనా లక్షణాలుండడం.. క్వారంటైన్ కు పంపడం కలకలం రేపింది.. వీరితో కలిసి విందులో పాల్గొన్న 500 మంది డేంజర్ లో పడ్డారు.దీంతో ఏ క్షణాన కరోనా బాంబ్ ఏపీ నెత్తిన పడుతుందోనన్న భయం అందరినీ వెంటాడుతోంది.

లాక్డౌన్ చేయడానికి ఒక రోజు ముందు కొద్ది రోజుల క్రితం మతపరమైన సమావేశానికి హాజరైన వైసీపీ గుంటూరు ఎమ్మెల్యే ముస్తఫా ఢిల్లీ నుండి గుంటూరుకు తిరిగి వచ్చాడు. అనంతరం సుమారు 500 మందికి భారీ విందు ఏర్పాటు చేశాడు. ముస్తాఫాకు కరోనా లక్షణాలుండడంతో విందుకు హాజరైన బంధువులు - ప్రముఖులు - ఇతరుల కుటుంబాలలో ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి.

నిజానికి సీఎం వైయస్ జగన్ కూడా ఎమ్మెల్యే ముస్తఫాను కలవాలని భావించినప్పటికీ బిజీ షెడ్యూల్ కారణంగా అతడిని కలవలేకపోయాడు. కలిస్తే ఇప్పుడు పెద్ద ఉపద్రవమే వచ్చి ఉండేది. సీఎం జగన్ సైతం క్వారంటైన్ లో ఉండాల్సిన దుస్థితి దాపురించేది. లక్కీగా కరోనా కాటు నుంచి సీఎం జగన్ తృటిలో తప్పించుకున్నారు..

ఎమ్మెల్యే ముస్తాఫా నిర్లక్ష్యం తో ఇప్పుడు 500 మంది డేంజర్ లో పడ్డారు. ఇది రాష్ట్రంలో పరిస్థితి తీవ్రతను పెంచుతోంది. అనుమానాస్పద వ్యక్తుల్లో భయం నెలకొంది.

ఇప్పుడు ముస్తాఫా ద్వారా ఎంతమందికి కరోనా సంక్రమిస్తుందనేది పెద్ద ప్రశ్నగా మారింది. ఇది రాబోయే కొద్దిరోజుల్లోనే బయటపడనుంది.