Begin typing your search above and press return to search.

సీఎం జగన్ అనుచరుడు మంగలి క్రిష్ణను హైదరాబాద్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారా?

By:  Tupaki Desk   |   15 Sep 2022 10:30 AM GMT
సీఎం జగన్ అనుచరుడు మంగలి క్రిష్ణను హైదరాబాద్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారా?
X
ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి ముఖ్యఅనుచరుడుగా చెప్పే మంగలి క్రిష్ణను హైదరాబాద్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారా? ఆయన్ను గచ్చిబౌలి పోలీస్ స్టేషన్ కు తీసుకొచ్చారా? పులివెందులకు చెందిన ఆయన్ను సైబరాబాద్పోలీసులు అదుపులోకి తీసుకొని ప్రశ్నిస్తున్నట్లుగా జరుగుతున్న ప్రచారంలో నిజమెంత? అసలేం జరిగింది? అన్నదిప్పుడు ప్రశ్నగా మారింది.

గురువారం ఉదయం వాట్సాప్ గ్రూపుల్లో మంగలి క్రిష్ణను సైబరాబాద్ పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లుగా ప్రచారం జరిగింది. గచ్చిబౌలి పోలీస్ స్టేషన్ పరిధిలోని ఒక విల్లాను అద్దెకు తీసుకున్న మంగలి క్రిష్ణ.. ఆ యజమాని (శివ ప్రసాద్ రెడ్డి)కి ఏడాది నుంచి అద్దె చెల్లించకుండా ఉండిపోయినట్లుగా చెబుతున్నారు. ఎన్నిసార్లు అడిగినా.. అద్దె చెల్లించని నేపథ్యంలో విసిగిపోయిన యజమాని గచ్చిబౌలి పోలీసులకు ఫిర్యాదు చేసినట్లుగా చెబుతున్నారు.

అద్దె అడిగితే.. బెదిరింపులకు దిగుతున్న మంగలి క్రిష్ణ తీరుపై గచ్చిబౌలి పోలీసులకు ఫిర్యాదు చేయటం.. పోలీసులు రంగంలోకి దిగినట్లుగా తెలుస్తోంది. ముందు మంగలి క్రిష్ణ గురించి అవగాహన లేకపోవటం ఆయన్న అదుపులోకి తీసుకున్న పోలీసులు.. ఆ తర్వాత విషయం తెలిసిన కాస్తంత జాగ్రత్తలు తీసుకున్నట్లుగా చెబుతున్నారు.

తొలుత అతడి మీద కేసునమోదు చేసేందుకు రంగం సిద్ధం కాగా.. తర్వాత చోటు చేసుకున్న పరిణామాల నేపథ్యంలో.. వెనక్కి తగ్గినట్లుగా చెబుతున్నారు.

దీనికి సంబంధించిన వివరాలు వాట్సాప్ గ్రూపుల్లో పెద్ద ఎత్తున వైరల్ అయ్యాయి. ఈ నేపథ్యంలో గచ్చిబౌలి సీఐ సురేశ్.. మీడియా ప్రతినిధులకు క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేశారు. విల్లా యజమాని శివప్రసాద్ రెడ్డికి.. మంగలి క్రిష్ణకు మధ్య అద్దె చెల్లింపులో చిన్న వివాదం తలెత్తిందని.. తొలుత ఫిర్యాదు చేసినప్పటికీ.. తర్వాత వాపసు తీసుకున్నట్లుగా చెబుతున్నారు.

ఇద్దరు పాత మిత్రులే అని.. ఫిర్యాదు ఇచ్చినప్పటికీ తర్వాత రాజీ చేసుకున్నట్లుగా చెబుతున్నారు. మొత్తంగా తొలుత పోలీసుల అదుపులో ఉన్నట్లుగా ప్రచారం జరిగినా.. అదేమీ లేదు.. అంతా తూచ్.. స్టేషన్ లో రాజీ కూడా అయిపోయిందన్న మాట  చెప్పటం గమనార్హం.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.