Begin typing your search above and press return to search.

రైతులకు మరో వరం ఇచ్చిన సీఎం జగన్

By:  Tupaki Desk   |   1 Feb 2021 7:10 PM GMT
రైతులకు మరో వరం ఇచ్చిన సీఎం జగన్
X
సీఎం జగన్ మరో సంచలన నిర్ణయం తీసుకున్నారు. రైతులకు మేలు కోసం కొత్త ప్రతిపాదన చేశారు. రైతులకు రక్షణగా పోలీస్ వ్యవస్థ ఉండాలని.. రైతు సమసూ్యలపై ప్రత్యేకంగా జిల్లాకో పోలీస్ స్టేషన్ ఆలోచన చేస్తున్నామని జగన్ పేర్కొన్నారు.

వ్యవసాయ ఉత్పత్తుల విక్రయం తదితర వ్యవహారాల్లో మోసాలు జరిగితే రైతులకు అండగా నిలిచి వారికి న్యాయం చేయడం కోసం ఈ వ్యవస్థ ఏర్పాటు చేయాలని యోచిస్తున్నట్టు సీఎం జగన్ తెలిపారు. వ్యాపారుల నుంచి మోసాలకు గురికాకుండా రైతుకు భద్రత కల్పించడమే దీని ముఖ్య ఉద్దేశమని పేర్కొన్నారు.

ప్రతీ పోలీస్ స్టేషన్ లో దిశ హెల్ప్ డెస్క్ తరహాలో రైతుల కోసం ఒక డెస్క్ ను ఏర్పాటు చేస్తామని ప్రకటించారు. ఈ నూతన వ్యవస్థ ఎలా ఉండాలన్న దానిపై మేథో మథనం చేసి కార్యాచరణ రూపొందించాలని అధికారులను ఆదేశించారు.ఇక గ్రామ, వార్డు సచివాలయాల్లో పనిచేస్తున్న సిబ్బందికి యూనిఫామ్స్, ప్రతిరోజు 2 గంటల పాటు స్పందన కార్యక్రమం నిర్వహించాలని సూచించారు.

ఇక దిశ చట్టం అమలుపై సీఎం వైఎస్ జగన్ మంగళవారం అధికారులతో సమీక్ష నిర్వహించారు. మహిళల భద్రత, రక్షణ కోసం తీసుకువచ్చిన ఈ చట్టాన్ని పటిష్టం చేయడానికి తీసుకుంటున్న చర్యలను అధికారులు సీఎంకు వివరించారు. 2019తో పోలిస్తే 2020లో మహిళలపై 7.5 శాతం నేరాలు తగ్గాయని అధికారులు నివేదించారు. రాష్ట్రంలో 12 లక్షల మంది దిశ యాప్‌ను డౌన్‌ లోడ్‌ చేసుకున్నారని, దిశ దర్యాప్తు (పెట్రోలింగ్‌) వాహనంపై ప్రధాని ప్రశంసలు కురిపించారని అధికారులు సీఎం దృష్టికి తీసుకొచ్చారు.