Begin typing your search above and press return to search.

ఏపీ ప్రజలకు సీఎం జగన్ వరాలివీ

By:  Tupaki Desk   |   12 Feb 2021 1:30 PM GMT
ఏపీ ప్రజలకు సీఎం జగన్ వరాలివీ
X
ఏపీ సీఎం జగన్ మరోసారి ప్రజలపై వరాల వాన కురిపించారు. రాష్ట్రంలోని డిగ్రీ కాలేజీల్లో ఇంగ్లీష్ మీడియం ప్రవేశపెట్టాలని నిర్ణయించారు. ఇంగ్లీష్ మీడియం ప్రవేశపెట్టడం వల్ల విద్యార్థులు ఇబ్బందులు పడకుండా తగిన కోర్సులను తీసుకోవాలని సీఎం జగన్ ఆదేశించారు. శుక్రవారం క్యాంప్ ఆఫీసులో ఉన్నత విద్యాశాఖపై జగన్ సమీక్షించారు. 11, 12 తరగతులకు కూడా ఇంగ్లీష్ మీడియాన్ని ప్రవేశపెట్టాలని జగన్ నిర్ణయించారు. పాఠ్యపుస్తకాలన్నీ ఇక ఇంగ్లీష్ లోనూ ముద్రించాలని ఆదేశించారు. దీనివల్ల ఉద్యోగ అవకాశాలు మెరుగుపడుతాయని చెప్పారు.

ఇక ప్రజలకు ఇంటర్నెట్ ను చేరువ చేసే నిర్ణయాన్ని జగన్ తీసుకున్నారు. ఏపీలోని ప్రతి గ్రామానికి అన్ లిమిటెడ్ ఇంటర్నెట్ ను తీసుకొస్తున్నామని జగన్ తెలిపారు. అమ్మఒడి, వసతి దీవెన పథకాల లబ్ధిదారులకు ఆప్షన్ గా ల్యాప్ ట్యాప్ లను సరసమైన ధరలకు వచ్చేలా చూస్తామన్నారు.కోవిడ్ తర్వాత కాలేజీల ప్రారంభం, క్లాసుల నిర్వహణపై అధికారులను జగన్ అడిగి తెలుసుకున్నారు. ఏపీ ప్రైవేటు యూనివర్సిటీ యాక్ట్ 2006ను సవరించడంపై చర్చించారు.

ఈ అసెంబ్లీ సమావేశాల్లోనే ఏపీ ప్రైవేటు యూనివర్శిటీ యాక్ట్‌ -2006కు సవరణ బిల్లు ప్రవేశపెట్టాలని జగన్ నిర్ణయించారు.ప్రపంచంలోని 200 అత్యుత్తమ విద్యా సంస్ధలతో జాయింట్‌ సర్టిఫికేషన్‌ ఉండాలని, ఐదేళ్లకాలం పాటు ఇది కొనసాగాలని అన్నారు. ఈ క్రైటీరియాను అందుకున్న పక్షంలోనే ప్రైవేటు యూనివర్శిటీగా వారికి అనుమతి ఇవ్వడానికి తగిన అర్హతగా పరిగణించాలని చెప్పారు.తొలిసారిగా ప్రైవేటు యూనివర్శిటీలు పెట్టేవారికి.. ఇప్పుడున్న కాలేజీలను ప్రైవేటు యూనివర్శిటీలుగా మార్చాలంటే కూడా అత్యుత్తమ ప్రమాణాలను నిర్దేశించాలని ఆదేశించారు.