Begin typing your search above and press return to search.

మ‌రో వివాదంలో సీఎం జ‌గ‌న్ ?

By:  Tupaki Desk   |   9 May 2022 10:30 AM GMT
మ‌రో వివాదంలో సీఎం జ‌గ‌న్ ?
X
అభంశుభం తెలియ‌ని బిడ్డ‌లంతా ఏదో ఒక చోట కొంద‌రి నిర్ద‌యామ‌య ప్ర‌వ‌ర్త‌నకు బ‌లి అవుతున్నారు. వైసీపీ స‌ర్కారులో వీటిపై మాట్లాడే వారంతా అస్స‌లు బాధ్య‌త‌లు ప‌ట్ట‌ని విధంగా ఉండ‌డ‌మే ఇందుకు కార‌ణం అని త‌రుచూ విప‌క్షం రోడ్డెక్కి నిర‌స‌న‌లు వ్య‌క్తం చేస్తోంది. మాట్లాడే వారికి మ‌హిళా క‌మిష‌న్ చైర్మ‌న్ నోటీసులు ఇచ్చే బ‌దులు నిందితుల‌ను ప‌ట్టుకోవ‌డంలో విఫ‌లం అవుతున్న పోలీసు యంత్రాంగాన్ని ఎందుక‌ని మంద‌లించ‌లేక‌పోతున్నార‌ని, ఈ విష‌య‌మై వాసిరెడ్డి ప‌ద్మ ఎందుక‌ని విఫ‌లం అవుతున్నార‌ని విప‌క్షం ప్ర‌శ్నిస్తోంది. ఇదే స‌మ‌యంలో ద‌ళిత హ‌క్కుల‌పై ఎస్సీ క‌మిష‌న్ ప‌ట్టుబ‌డినంత‌గా ఎందుక‌నో మ‌హిళా క‌మిష‌న్ బాధిత వ‌ర్గాల హ‌క్కుల‌ను కాపాడడంలో వెనుకంజ వేస్తోంది. క‌నీసం నిష్ప‌క్ష‌పాత వైఖ‌రిలో భాగంగా ఓ ఎఫ్ఐఆర్ ను కూడా రాయించ‌లేక‌పోతోంది. న‌మోదు చేయించ‌లేక‌పోతోంది. ఇదే ఇప్పుడు వివాదాల‌కు కార‌ణం అవుతోంది. నో డౌట్.. పోలీసులు కూడా రాజ‌కీయ ఒత్తిళ్ల‌కు లొంగే ప‌నిచేయాలి కాద‌నరు కానీ మ‌రి! బాధిత వ‌ర్గాల‌కు ఈ స‌మ‌యంలో సాయం చేసేది ఎవ్వ‌ర‌ని?

వ‌రుస అత్యాచార ఘ‌ట‌న‌లు ఆంధ్రావ‌నిని అత‌లాకుత‌లం చేస్తున్నాయి. తాజాగా స‌త్య‌సాయి జిల్లాలో జ‌రిగిన ఘ‌ట‌న‌లో పోలీసులు ప్ర‌వ‌ర్తించిన తీరుపై ప‌లు సందేహాలు వ్య‌క్తం అవుతున్నాయి విప‌క్షం నుంచి ! మ‌రోవైపు దీన్నొక అనుమానాస్పద మృతిగా ప‌రిగ‌ణించాల‌ని కూడా ప‌ట్టుబ‌డుతున్నారు. ఏద‌యినా ఘ‌ట‌న జ‌రిగితే తామేం మాట్లాడినా నానా యాగీ చేస్తున్నార‌ని సీఎం అన‌డం భావ్యం కాద‌ని, త‌గిన విచార‌ణ చేప‌ట్టి ఘ‌ట‌న‌కు కార‌కుల‌యిన వారిని, ముఖ్యంగా సొంత పార్టీ మ‌నుషులు అయినా క‌ఠినంగా శిక్షించాల‌ని కోరుతూ లోకేశ్ ఇవాళ సోష‌ల్ మీడియా ఓ పోస్టు ఉంచారు. కేవ‌లం మీ వాళ్ల క‌ళ్ల‌ల్లో సంతోషం కోసం బాధిత వ‌ర్గాల‌కు అన్యాయం చేయొద్ద‌ని ఆయ‌న విన్న‌విస్తూ, మ‌రికొన్ని విష‌యాలు కూడా ఆ పోస్టులో పేర్కొన్నారు. పోలీసులు ఉద్దేశ పూర్వ‌కంగానే వైసీపీ నాయ‌కులకు అండ‌గా నిలుస్తూ కేసును ప‌క్క‌దోవ ప‌ట్టించ‌డంతో ఓ ఆడ‌బిడ్డ కుటుంబానికి న్యాయం ఎలా జ‌ర‌గుతుంద‌ని ప్ర‌శ్నిస్తున్నారు.

పుట్ట‌ప‌ర్తి స‌త్య‌సాయి జిల్లాలో జరిగిన ఓ హ‌త్యాచార ఘ‌ట‌న ప‌లు వివాదాల‌కు తావిస్తోంది. ఇక్క‌డి బి ఫార్మ‌శీ స్టూడెంట్ హ‌త్యాచారానికి గురైంద‌ని, కానీ దానిని ఆత్మ‌హ‌త్యగా మార్చే ప్ర‌య‌త్నం చేస్తున్నార‌ని పేర్కొంటూ పోలీసులు అధికార పార్టీకి కొమ్ముకాస్తున్నారని ఆరోపిస్తూ తెలుగుదేశం నాయ‌కులు లోకేశ్ ఆరోపిస్తున్నారు. దీనిపై స‌మ‌గ్ర విచార‌ణ‌కు ప‌ట్టుబ‌డుతున్నారు. నిందితుడ్ని క‌ఠినంగా శిక్షించాల‌ని డిమాండ్ చేస్తున్నారు. పోస్ట్ మార్టం కాకుండానే ఆత్మహత్యగా డీఎస్పీ ఈ ఘ‌ట‌న‌ను తేల్చేయ‌డం ప‌లు వివాదాల‌కు తావిస్తోంది. నిన్న‌టి రేప్ నేటి సూసైడ్ గా ఎలా మారింద‌ని ప్ర‌శ్నిస్తున్నారాయ‌న. మీ బిడ్డలకో, మీ నేతల పిల్లలకో ఇదే అన్యాయం జరిగితే ఇలానే స్పందిస్తారా? అని అంటున్నారు లోకేశ్.