Begin typing your search above and press return to search.

గాజువాక ఘటనపై సీఎం జగన్ సీరియస్

By:  Tupaki Desk   |   1 Nov 2020 1:00 PM GMT
గాజువాక ఘటనపై సీఎం జగన్ సీరియస్
X
గాజువాకలోని శ్రీనగర్ సుందరయ్య కాలనీలో శనివారం రాత్రి వరలక్ష్మీ అనే యువతిని ప్రేమోన్మాది అఖిల్ సాయి నరికిచంపడం కలకలం రేపింది. ప్రేమ పేరుతో వేధిస్తూ అఖిల్ సాయి వెంకట్ అనే యువకుడు ఈ ఘాతుకానికి పాల్పడ్డ సంగతి తెలిసిందే.

గాజువాకలో జరిగిన ఈ దారుణంపై ఏపీ సీఎం జగన్ సీరియస్ గా స్పందించారు. నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని డీజీపీకి ఆదేశాలు జారీ చేశారు.ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చూడాలని డీజీపీ, సీఎస్ ని ఆదేశించారు.

ఈ సందర్భంగా బాధితురాలు వరలక్ష్మీ కుటుంబ సభ్యులకు రూ.10లక్షల ఆర్థిక సాయం ప్రకటించారు. మహిళల భద్రత పట్ల జాగ్రత్తగా ఉండాలని డీజీపీ, సీఎస్ లను జగన్ ఆదేశించారు. విద్యార్థినులందరూ దిశా యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవాలని అవగాహన కల్పించాలని స్పష్టం చేశారు.

ప్రేమోన్మాది ఘాతుకం తెలియకగా సీఎం జగన్ వెంటనే హోంమంత్రి సుచరిత, సీఎస్, డీజీపీ, ఇంటెలిజెన్స్ చీఫ్ ల నుంచి సమాచారం తెలుసుకున్నారు. వరలక్ష్మీ కుటుంబాన్ని పరామర్శించాలని హోమంత్రి సుచరితను, దిశా ప్రత్యేక అధికారులను ఆదేశించారు. రాష్ట్రంలో మహిళలపై జరిగే నేరాలను అదుపు చేసే విధంగా పూర్తి స్థాయిలో కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.

ప్రధాన నిందితుడు అకిల్ సాయి ఆంధ్రా యూనివర్సిటీలో బీఎల్ చదువుతున్నట్టు పోలీసులు విచారణలో తెలుసుకున్నారు. బాధిత కుటుంబ సభ్యుల ఫిర్యాదుతో దిశాచట్టం కింద కేసు నమోదుచేసి ప్రేమోన్మాది అఖిల్ సాయి, సహకరించిన రాము అనే యువకుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.