Begin typing your search above and press return to search.

పరిషత్ ఎన్నికలపై సీఎం జగన్ కీలక ఆదేశాలు..ఏంటంటే?

By:  Tupaki Desk   |   17 March 2021 11:20 AM GMT
పరిషత్ ఎన్నికలపై సీఎం జగన్ కీలక ఆదేశాలు..ఏంటంటే?
X
దేశంలో పెరిగిపోతున్న కరోనా వైరస్ పాజిటివ్ కేసుల పై దేశంలోని గవర్నర్లు, లెఫ్టినెంట్‌ గవర్నర్లు, ముఖ్యమంత్రులతో ప్రధాని నరేంద్ర మోదీ వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించిన సంగతి తెలిసిందే. ఈ సమావేశం తర్వాత సీఎం జగన్ కరోన కేసులు, వ్యాక్సినేషన్ పై అధికారులతో సమీక్ష నిర్వహించారు. వ్యాక్సినేషన్‌ కు ఎన్నికల ప్రక్రియ అడ్డంగా మారింది అని, అధికార యంత్రాంగం మొత్తం ఎన్నికల నిర్వహణలో మునిగిపోయిందని జగన్ అన్నారు. జడ్పీటీసీ, ఎంపీటీసీల ఎన్నికల్లో ఆరు రోజుల ప్రక్రియే మిగిలి ఉందని, మున్సిపల్‌ ఎన్నికలు పూర్తయిన వెంటనే ఇవికూడా జరిగిపోయి ఉంటే బాగుండేదని, కానీ , ఈ ఎన్నికల్లో కొంచెం జాప్యం జరుగుతూ వస్తోందని అన్నారు.

దేశవ్యాప్తంగా పెరుగుతున్న కేసులు, ప్రజారోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని జెడ్పీటీసీ - ఎంపీటీసీ ఎన్నికల్లో మిగిలిపోయిన 6 రోజుల ఎన్నికల ప్రక్రియన త్వరగా ముగించాల్సిన అవసరం ఎంతైనా ఉందని అన్నారు. ఈ పరిషత్ ఎన్నికల ప్రక్రియ పూర్తి కాగానే, వ్యాక్సినేషన్‌ ప్రక్రియను ఉద్ధృతంగా ముందుకు తీసుకెళ్లవచ్చు అని, లేకపోతే వైరస్‌ వ్యాపిస్తున్న ప్రాంతాలు కంటైన్‌ మెంట్‌ చేయడం, ఆయా ప్రాంతాల్లో పరీక్షలు నిర్వహించడం కష్టం అవుతుంది అన్నారు. ప్రభుత్వం తరఫున అధికారికంగా గవర్నర్‌ కు - హైకోర్టుకు నివేదించాలని అన్నారు. ప్రజల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని, దేశవ్యాప్తంగా మళ్లీ కేసులు పెరుగుతున్న అంశాన్ని పరిగణనలోకి తీసుకుని జెడ్పీటీసీ - ఎంపీటీసీల ఎన్నికల్లో మిగిలిపోయిన ఆ 6 రోజుల ప్రక్రియను వేగంగా పూర్తి చేయడానికి తగిన చర్యలు తీసుకోవాలని తెలిపారు.

వ్యాక్సినేషన్‌ను ఉద్ధృతంగా చేపట్టే కార్యక్రమంలో భాగంగా గ్రామ సచివాలయాలను యూనిట్‌గా తీసుకోవాలని, సంబంధిత సచివాలయం పరిధిలో ఉన్నవారికి వ్యాక్సినేషన్‌ను పూర్తిచేయడంపై దృష్టిపెట్టి, ఆ లక్ష్యాన్ని చేరుకోవాలని ఆదేసహించారు. 45 ఏళ్లకు పైబడి, దీర్ఘకాలిక వ్యాధితో బాధ పడుతున్న వారికి వ్యాక్సిన్ సత్వరమే అందించాలని అన్నారు. వైరస్‌ సోకినవారికి చికిత్స అందించడం కన్నా... ఆ వైరస్‌ రాకుండా నివారణా పద్ధతులపై దృష్టిపెట్టాలని అన్నారు. ఇదిలా ఉంటే సీఎంలతో మోడీ వీడియో సమావేశంలో ఏపీలో 10 శాతం వరకు వ్యాక్సినేషన్ వృధా గా పోతుంది అని సీఎం జగన్ పనితీరు పట్ల కొంచెం అసహనం వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే.