Begin typing your search above and press return to search.

ప్రధాని మోదీకి సీఎం జగన్ లేఖ: అపాయింట్‌మెంట్ ఇవ్వండి...అఖిల పక్షంతో వస్తాం !

By:  Tupaki Desk   |   9 March 2021 10:01 AM GMT
ప్రధాని మోదీకి సీఎం జగన్ లేఖ: అపాయింట్‌మెంట్ ఇవ్వండి...అఖిల పక్షంతో వస్తాం !
X
ఏపీ సీఎం వైఎస్ జగన్ ‌మోహన్‌ రెడ్డి ప్రధాని నరేంద్ర మోదీకి మరోసారి లేఖ రాశారు. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణపై పునరాలోచించాలని.. తాను స్వయంగా కలిసి పరిస్థితిని వివరించేందుకు అపాయింట్‌ మెంట్ ఇవ్వాలని కోరారు. తనతో పాటూ అఖిలపక్ష నేతలు, కార్మిక సంఘాల నాయకుల్ని ఢిల్లీకి తీసుకొస్తానని లేఖలో పేర్కొన్నారు. అలాగే ప్లాంట్ ప్రైవేటీకరణను నాలుగు ప్రత్యామ్నాయాలను జగన్ సూచించారు. ఏపీ సీఎం రాసిన లేఖపై ప్రధాని ఎలా స్పందిస్తాన్నది ఆసక్తికరంగా మారింది.

తాజాగా కేంద్రం ప్రకటన తరువాత ఏపీ వ్యాప్తంగా ఉద్యమం ఎగసిపడుతోంది. విశాఖలో అయితే అర్థరాత్రి నుంచి ఆందోళనలు కొనసాగూతూనే ఉన్నాయి. రాజకీయ నాయకులను నిర్బంధిస్తామని కార్మిక సంఘాలు హెచ్చరిస్తున్నాయి. ముఖ్యంగా కేంద్రానికి తోడు రాష్ట్ర ప్రభుత్వాన్ని కూడా కార్మికసంఘాలు విమర్శిస్తున్నాయి. ఈ నేపథ్యంలో అలర్ట్ అయిన సీఎం జగన్ మరోసారి ప్రధాని మోదీకి లేఖ రాశారు. రాష్ట్ర ప్రజల సెంటిమెంట్, ఆంద్రప్రదేశ్ ప్రయోజనాలను అన్నింటినీ ఆలోచించి స్టీల్ ప్లాంట్ పై నిర్ణయాన్ని మార్చుకోవాలని లేఖలో కోరారు. తమ సమస్యను నేరుగా వచ్చి వినిపించే అవకాశం కల్పించాలని అన్నారు. అలాగే గతంలో రాసిన లేఖపైనా స్పందించలేదని దీనిపైనైనా వెంటనే స్పందించాలని జగన్ కోరారు.

విశాఖ ప్లాంట్ కోసం ఐరన్ ఓర్ మైన్స్ కేటాయించాలని జగన్ విన్నవించారు. స్వల్ప, దీర్ఘకాలిక రుణాలను ఈక్విటీగా మార్చాలని, రూ.22వేల కోట్ల రుణాలను ఈక్విటీగా మార్చాలని కోరారు. దీనివల్ల పరిశ్రమపై వడ్డీ భారం తగ్గుతుందన్నారు. ఉపయోగం లేని 7వేల ఎకరాలను ప్లాట్ల రూపంలో అమ్మవచ్చని..ప్లాట్ల రూపంలో అమ్మడం ద్వారా సంస్థ ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతందన్నారు. పెట్టబడులు ఉపసంహరించుకుండా కేంద్రం మద్దతిస్తే సంస్థ కోలుకుంటుందని.. ఉక్కు పరిశ్రమ వీ షేప్డ్ రికవరీ అవుతుందన్నారు. ఇదిలా ఉంటే .. లోక్‌సభలో విశాఖపట్నం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ ఎంవీవీ సత్యనారాయణ అడిగిన ప్రశ్నకు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ లిఖిత పూర్వక సమాధానమిచ్చారు. విశాఖ స్టీల్‌ ప్లాంట్‌ లో రాష్ట్రానికి ఎలాంటి ఈక్విటీ షేర్లు లేవన్నారు. పరిశ్రమలో 100 శాతం పెట్టుబడులు ఉపసంహరిస్తున్నట్లు చెప్పారు. ప్లాంట్‌ ను మొత్తం ప్రైవేటుపరం చేయబోతున్నట్లు ప్రకటించారు. మెరుగైన ఉత్పాదకత కోసమే విశాఖ ఉక్కును ప్రైవేటీకరణ చేస్తున్నామన్నారు.