Begin typing your search above and press return to search.

విశాఖ ఉక్కుపై కీలక ప్రకటన చేసిన సీఎం జగన్

By:  Tupaki Desk   |   17 Feb 2021 12:49 PM GMT
విశాఖ ఉక్కుపై కీలక ప్రకటన చేసిన సీఎం జగన్
X
ఆంధ్రుల హక్కు విశాఖ ఉక్కును కేంద్రం ప్రైవేటీకరణ చేయాలన్న నిర్ణయాన్ని తీసుకోవటం.. దీనిపై ఆంధ్రులు తీవ్రమైన ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు. కేంద్రం నిర్ణయాన్ని ఒప్పుకునేది లేదన్న వాదనను ప్రజలు వినిపిస్తున్నా.. కేంద్రం నుంచి ఇప్పటివరకు ఆ అంశంపై వెనక్కి తగ్గుతామన్న సంకేతాల్ని ఇచ్చేలా ప్రకటన రాలేదు. ఇదిలా ఉండగా.. ఈ ఇష్యూ మీద రాజకీయ రగడ అంతకంతకూ ఎక్కువ అవుతోంది. తాజాగా ఏపీ విపక్ష నేత.. టీడీపీ అధినేత చంద్రబాబు మాట్లాడుతూ.. విశాఖ ఉక్కు పరిశ్రమపై ఉద్యమానికి సీఎం జగన్ నాయకత్వం వహించాలని.. తాను ఆ మార్గంలో నడుస్తానని వ్యాఖ్యలు చేయటం తెలిసిందే.

విశాఖ ఉక్కుపై జరుగుతున్న రగడపై ఇప్పటివరకు సరైన రీతిలో సీఎం జగన్మోహన్ రెడ్డి స్పందించటం లేదన్న విమర్శను ఎదుర్కొంటున్నారు. అంతేకాదు.. విశాఖ ఉక్కును పోస్కోకు కట్టబెట్టేందుకు ప్లానింగ్ జరుగుతోందని పేర్కొంటూ జగన్ సర్కారు మాత్రం ఇవేమీ పట్టనట్లు తన పని తాను చేసుకుంటూ పోతుందని.. ఇది సరైన విధానం కాదన్న ఆరోపనలు వినిపిస్తున్నాయి. ఇలాంటి వేళ.. ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

ఈ రోజు విశాఖ నగరానికి పర్యటించటానికి వచ్చిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ను విశాఖ ఉక్కు పరిరక్షణ కమిటీ మాట్లాడే ప్రయత్నం చేసింది. ఈ సందర్భంగా తమకొచ్చిన సమస్యల్ని పేర్కొన్న రైతులు పలువురు.. విశాఖ ఉక్కుపై తమకొచ్చిన సందేహాలకు సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి ముందు పెట్టారు. వారి ప్రశ్నల్ని ఓపిగ్గా విన్న సీఎం.. దక్షిణ కొరియాకు చెందిన ఫోస్కో కంపెనీని మాత్రం ఏపీలో అడుగు పెట్టనివ్వనని సీఎం జగన్ మాట ఇప్పుడు సంచలనంగా మారింది. కేంద్రం నేరుగా ప్రకటన చేసిన వేళ.. అందుకు భిన్నంగా పోస్కో కంపెనీని విశాఖస్టీల్ ప్లాంట్ లోకి అడుగు పెట్టనీయని తేల్చేశారు.

పోస్కో ప్రాజెక్టును భావనా పాడు.. కడప.. క్రిష్ణపట్నంలో ఏర్పాటు చేస్తామన్నారు. సీఎం జగన్ విస్పష్టంగా తన అభిప్రాయాన్ని చెప్పినప్పటికి.. స్టీల్ ప్లాంట్ ను ప్రేవైటీకరణ అంశాన్ని కేంద్రం వెనక్కి తీసుకునే వరకు తాము వెనక్కి తగ్గమని స్పష్టం చేస్తున్నాయి కార్మిక సంఘాలు. మరి.. మోడీ మొండితనం ముందు విశాఖ ఉక్కు ప్రరిశ్రమ ఫ్యూచర్ ఏమవుతుందన్ని కాలమే సరైన సమాధానం చెప్పగలదు.