Begin typing your search above and press return to search.

సీఎం కుర్చీ విశాఖకు...అంతా అయిపోయిందా...?

By:  Tupaki Desk   |   14 Dec 2022 8:00 AM IST
సీఎం కుర్చీ విశాఖకు...అంతా అయిపోయిందా...?
X
విశాఖ అంటే మొదటి నుంచి జగన్ మోజు పడుతున్నారు. ఆయన రాజధాని చేస్తామని ప్రతిపాదించారు. అది 2019 డిసెంబర్ 17న ఫస్ట్ టైం. ఆ రోజు అసెంబ్లీ శీతాకాల సమావేశాల ముగింపు. రాత్రి చివరాఖరున ముఖ్యమంత్రి ప్రసంగం. ఆయన మామూలుగానే మాట్లాడుతారు అని అంతా అనుకున్నారు.

కానీ కొద్ది సేపటి తరువాత సీఎం ప్రసంగం అంతా మూడు రాజధానుల వైపు మళ్ళింది. సౌత్ కొరియా ఎగ్జాంపుల్ చెప్పి ఏపీకి మూడు ఉంటే ఏంటి అని తనదైన స్టైల్ లో జగన్ సభలో ప్రశ్నించారు. విశాఖను ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ గా చేస్తామని నాడే ప్రతిపాదించారు. ఆ తరువాత ఎంత అగ్గి రాజుకుందో అందరికీ తెలిసిందే.

సరిగ్గా ఏడాది క్రితం మూడు రాజధానుల చట్టాన్ని జగన్ సర్కార్ విత్ డ్రా చేసుకుంది. హై కోర్టు అమరావతే క్యాపిటల్ అని ఫైనల్ జడ్జిమెంట్ ఇచ్చింది. ఇక జగన్ ఆలోచనలు అన్నీ అమరావతితోనే అనుకున్నారు. కానీ మూడు నెలల క్రితం సుప్రీం కోర్టు తలుపు తట్టారు జగన్. ప్రస్తుతం ఆ కేసు అక్కడ పెండింగులో ఉంది. ఏ విషయం తేలడానికి చాలా సమయం పడుతుంది.

ఇంతలో మరో సంచలనం. తాజాగా జరిగిన మంత్రి వర్గ సమావేశంలో సీఎంఓ ఆఫీస్ ని విశాఖకు షిఫ్ట్ చేయడానికి క్యాబినేట్ ఓకే చెప్పిందని. ఇక తదుపరి కార్యక్రమం జస్ట్ లాంచనప్రాయంగా మిగిలి ఉంది అని. అమరావతి రాజధాని విషయంలో మొదటి నుంచి వైసీపీ ఎందుకో అసంతృపిగా ఉంది. జగన్ అయితే రెడీ మేడ్ క్యాపిటల్ విశాఖ నుంచి పాలించుకుంటే పోయేది కదా అని ఆశ పడ్డారు.

ఇపుడు అది నెరవేరబోతోంది. ముఖ్యమంత్రి ఆఫీస్ విశాఖకు షిఫ్ట్ అవుతోంది. దీని వల్ల న్యాయపరమైన అవరోధాలు ఏవీ ఉండవనే అంటున్నారు. దాంతో వచ్చే ఏడాది ఏప్రిల్ 11న సీఎంఓ ఆఫీస్ విశాఖ నుంచి పనిచేస్తుంది అని ప్రచారం అయితే జోరుగా సాగుతోంది. ప్రభుత్వం ఈ విషయంలో క్లారిటీగానే ఉంది అని మంత్రి గుడివాడ అమరనాధ్ వంటి వారు తరచూ చేసే ప్రకటనల బట్టి అర్ధం అవుతోంది

అయితే ఇన్నాళ్ళూ సైలెంట్ గా ఉండి ఇపుడు బిగ్ మూవ్ ఇచ్చారు అని అంటున్నారు. దానికి కారణం ఎన్నికలు దగ్గరపడడం. మరో వైపు తాను విశాఖ నుంచి పాలించాలి అన్న ముఖ్యమంత్రి ఆ కోరికను నెరవేర్చుకోవడానికి పట్టుదలగా ఉన్నారు అని అంటున్నారు. మొత్తానికి విశాఖ రాజధాని అవదు అని టీడీపీ వారు వీర లెవెల్ లో శపధం చేశారు. అయితే అలా ఎందుకు కాదు అని జగన్ నిరూపించబోతున్నారు.

తానుగా వచ్చి విశాఖలో కూర్చోబోతున్నారు. సీఎం వస్తే ఇంకేముంది. మొత్తం పరివారం తరలిరావాల్సిందే. అవి నెమ్మదిగా జరుగుతాయి. ఆ విధంగా స్టెప్ బై స్టెప్ విశాఖ రాజధాని దిశగా జగన్ అడుగులు వేసేందుకు అతి పెద్ద ముందడుగు ఈ రోజు జరిగిన మంత్రివర్గ సమావేశంలో పడింది. సో జగన్ కేరాఫ్ విశాఖ అని ఇక కన్ ఫర్మ్ చేసుకోవచ్చేమో.

నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.