Begin typing your search above and press return to search.

బద్వేలుపై కసరత్తు పూర్తైందా? వైసీపీ అభ్యర్థి ఎవరంటే?

By:  Tupaki Desk   |   2 Aug 2021 12:30 PM GMT
బద్వేలుపై కసరత్తు పూర్తైందా? వైసీపీ అభ్యర్థి ఎవరంటే?
X
ఏపీలో జరిగిన అసెంబ్లీ ఎన్నికలకు కాస్త ముందుగానే తెలంగాణ రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికలు జరిగాయి. ఏ ముహుర్తంలో ఈ ఎన్నికల్ని నిర్వహించారో కానీ.. ఎన్నికలు ముగిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన తర్వాత నుంచి తరచూ ఏదో రకమైన రాజకీయ రగడ చోటు చేసుకోవటం లేదంటే ఎవరో ఒకరు మరణించటమో.. లేదంటే ఏదో ఒక కారణంగా రాజీనామాలు చేయటమో తెలిసిందే. ఈసారి తెలంగాణలో ఎక్కువ ఉప ఎన్నికలు జరుగుతున్నాయి. తెలంగాణతో పోలిస్తే.. ఏపీలో ఉప ఎన్నికల హడావుడి తక్కువే ఉందని చెప్పాలి. తిరుపతి ఎంపీ స్థానానికి ప్రాతినిధ్యం వహిస్తున్న వైసీపీ నేత మరణంతో ఉప ఎన్నిక అనివార్యం కావటం.. ఎన్నికల్లో అధికారపార్టీ అభ్యర్థి ఘనవిజయాన్ని సొంతం చేసుకోవటం తెలిసిందే.

సీఎం జగన్మోహన్ రెడ్డి సొంత జిల్లా కడపకు సంబంధించి బద్వేలు ఎమ్మెల్యే అనారోగ్యంతో మరణించటం తెలిసిందే. దీంతో.. బద్వేల్ ఉప ఎన్నికను మీడియాను పెద్దగా పట్టించుకున్నట్లుగా కనిపించదనే చెప్పాలి.తెలంగాణలో మాజీ మంత్రి ఈటల రాజీనామా చేసిన హుజూరాబాద్ ఉప ఎన్నిక ఇప్పుడు హాట్ హాట్ గా మారుతోంది. బద్వేలుకు సంబంధించి చూస్తే.. ఇక్కడా ఉప ఎన్నిక జరగాల్సి ఉంది. వైసీపీ ఎమ్మెల్యే డాక్టర్ వెంకటసుబ్బయ్య మరణించటంతో ఉప ఎన్నిక అనివార్యం కానుంది.

అయితే.. తెలంగాణలో మాదిరి కాకుండా..బద్వేలు ఉప ఎన్నిక మీద పెద్ద హడావుడి కనిపించని పరిస్థితి. వైసీపీకి కంచుకోటగా ఉండే.. వైసీపీకి తప్పించి.. మరెవరికి గెలుపు సాధ్యం కాని నియోజకవర్గంపై పెద్ద ఆసక్తి వ్యక్తం కావటం లేదంటున్నారు. ఉప ఎన్నిక జరిగినప్పటికీ అదంతా సాంకేతిక అంశమే తప్పించి.. తుది ఫలితం మాత్రం అధికార పక్షానికి అనుకూలంగా ఉంటుందన్న మాట వినిపిస్తోంది. అయితే.. బద్వేలు ఉప ఎన్నికకు సంబంధించిన సీఎం జగన్మోహన్ రెడ్డి సిద్ధంగా ఉన్నట్లు చెబుతున్నారు. ఇప్పటికే ఆయన ఉప ఎన్నికల బరిలో పార్టీ అభ్యర్థిగా ఎవరిని ఎంపిక చేయాలన్న దానిపై కసరత్తు పూర్తి అయినట్లుగా చెబుతున్నారు.

దివంగత ఎమ్మెల్యే డాక్టర్ వెంకట సబ్బయ్య సతీమణి సంధ్యను ఉప ఎన్నికల బరిలో పార్టీ అభ్యర్థిగా నియమించేందుకు సీఎం జగన్మోహన్ రెడ్డి ఓకే చెప్పినట్లుగా తెలుస్తోంది. ఎన్నికల సంఘం ఎప్పడైతే ఉప ఎన్నికల నోటిఫికేషన్ విడుదల చేస్తుందో.. ఆ వెంటనే వైసీపీ తన అభ్యర్థిని ప్రకటిస్తారన్న మాట విపిపిస్తోంది. మరి.. విపక్షం ఏం చేస్తుందన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారిందని చెప్పక తప్పదు.