Begin typing your search above and press return to search.
తాడేపల్లి అత్యాచార ఘటనపై స్పందించిన సీఎం జగన్
By: Tupaki Desk | 22 Jun 2021 5:30 PM GMTరెండు తెలుగు రాష్ట్రాల్లో సంచలనంగా మారిన తాడేపల్లి అత్యాచార ఘటనపై ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి స్పందించారు. కాబోయే భర్తతో పుష్కర ఘాట్ వద్ద ఇసుక తిన్నెల వద్ద కూర్చున్న యువతిపై అత్యాచార యత్నం జరగటం.. ఈ సందర్భంగా యువకుడిపై అమానుష దాడి జరగటం పెనుసంచలనంగా మారింది. ఈ దారుణానికి కారణమైన నిందితుల్ని పట్టుకునేందుకు పోలీసులు పెద్ద ఎత్తున గాలిస్తున్నారు. అత్యాచారం జరిగిన తర్వాత పడవలో పారిపోయినట్లుగా ప్రాధమిక సమాచారం అందుకున్న పోలీసులు వారి కోసం వెతుకుతున్నారు.
ఇదిలా ఉంటే.. ఈ దారుణ ఘటన తన మనసును కలిచివేసిందని సీఎం జగన్ ఆవేదన వ్యక్తం చేశారు. ఇలాంటి ఘటన భవిష్యత్తులో ఎక్కడా జరగకూడదన్నారు. అర్థరాత్రి వేళ కూడా మహిళలు స్వేచ్ఛగా తిరగగలిగే పరిస్థితి ఉన్నప్పుడే.. నిజమైన స్వాతంత్ర్యం వచ్చినట్లు గట్టిగా నమ్మే వ్యక్తినని చెప్పిన జగన్.. ఇకమీద ఇలాంటి ఘటనలు రిపీట్ కాకుండా చర్యలు తీసుకుంటామన్నారు.
తాడేపల్లి అత్యాచార ఘటనపై జగన్ సర్కారు సీరియస్ గా తీసుకుంది. ఇప్పటికే రాష్ట్ర డీజీపీ గౌతంసవాంగ్ ను తన క్యాంప్ కార్యాలయానికి పిలిపించుకున్న ఆయన.. ఈ ఘటనకు సంబంధించిన వివరాల్ని అడిగి తెలుసుకున్నారు. నిందితులుఎంతటి వారైనా ఉపేక్షించేది లేదని.. వారిని పట్టుకునేందుకు ప్రత్యేక టీంలను నియమించి దర్యాప్తును వేగవంతం చేయాలని ఆదేశించారు. సీఎం జగన్ సీరియస్ గా తీసుకున్న ఈ ఉదంతానికి కారణమైన నిందితుల్ని త్వరలో పట్టుకుంటామని పోలీసులు చెబుతున్నారు. మరేం జరుగుతుందో చూడాలి.