Begin typing your search above and press return to search.
ఏపీలో ఇకపై ప్రభుత్వ స్కూల్స్ లో కూడా ఎల్‌కేజీ, యూకేజీ విద్య !
By: Tupaki Desk | 21 July 2020 5:00 PM GMTఏపీలో కరోనా వైరస్ మహమ్మారి ఉగ్రరూపం దాల్చి..విలయతాండవం చేస్తుంది. ఈ సమయంలో ఏపీలో అధికారంలో ఉన్న జగన్ సర్కార్ ఓ వైపు కరోనాను అరికట్టడానికి పటిష్టమైన చర్యలు తీసుకుంటూనే మరోవైపు రాష్ట్ర అభివృద్ధి కోసం పలు సంక్షేమ పథకాల్ని అమలు చేస్తున్నారు. ఇప్పటికే ఎన్నో అద్భుతమైన పథకాలకి శ్రీకారం చుట్టిన సీఎం జగన్ .. తాజాగా మరో సంచలన నిర్ణయం తీసుకున్నారు. ముఖ్యంగా జగన్ ముఖ్యమంత్రిగా భాద్యతలు స్వీకరించినప్పటి నుండి విద్యావ్యవస్థ పై ప్రత్యేక దృష్టి పెట్టారు. ప్రతి పేద పిల్లవాడికి కార్పొరేట్ స్థాయి విద్యను అందించాలనే లక్ష్యంతో ముందుకుసాగుతున్నారు. ఈ తరుణంలో ప్రభుత్వ పాఠశాలల్లో వచ్చే ఏడాది నుంచి ఎల్‌కేజీ, యూకేజీ విద్య అమలు చేయాలని అధికారులను సీఎం జగన్ ఆదేశించారు.
పీపీ-1, పీపీ-2గా ప్రీప్రైమరీ విద్యను అమలు చేయాలని చెప్పారు. ప్రీ ప్రైమరీ విద్య కోసం ప్రత్యేక సిలబస్ ను రూపొందించాలని సూచించారు. మంగళవారం పాఠశాల విద్య, గోరుముద్ద నాణ్యతపై సీఎం వైఎస్ జగన్ క్యాంపు కార్యాలయంలో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సమీక్షలో విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు. మానవవనరుల సమర్థ వినియోగం, ఉత్తమమైన బోధన తదితర అంశాలపై కూడా చర్చ సాగింది. అనంతరం ఆ దిశగా సీఎం జగన్.. మరి కొన్ని కీలక నిర్ణయాలు తీసుకున్నారు. అలాగే స్కూళ్ల పక్కనే అంగన్‌వాడీ కేంద్రాలు ఉంటే బాగుంటుందని అధికారులు చెప్పగా దానికి సీఎం వైఎస్ జగన్ సానుకూలంగా స్పందించారు. రాష్ట్రంలో 55వేల అంగన్‌వాడీ కేంద్రాలు ఉన్నాయని సీఎం తెలిపారు. అందులో దాదాపు 35వేల కేంద్రాలకు భవనాలు లేవని అన్నారు. దీనితో అసలు స్కూల్స్ పక్కనే ఇవి పెట్టాలంటే అక్కడ సరైన స్థలాలు ఉన్నాయో లేవో చూసి ఓ నివేదిక ఇవ్వాలని సీఎం తెలిపారు.
అలాగే , అలాగే పీపీ-1, పీపీ-2 క్లాసులను కూడా ప్రాథమిక విద్య పరిధిలోకి తీసుకురావడంపై ఈ సమావేశంలో చర్చించారు. పీపీ-1, పీపీ-2 పిల్లలకు నాణ్యమైన విద్యను అందించే దిశగా చర్యలుండాలని సీఎం తెలిపారు. వీరికి పకడ్బందీ పాఠ్యప్రణాళిక ఉండాలని ఆదేశించారు. కాగా , ప్రభుత్వం ఇప్పటికే నాడు-నేడు ద్వారా పాఠశాలల్లో వసతులు మెరుగుపరిచే పనిలో ఉంది. అమ్మఒడి నగదు సాయం, మధ్యాహ్న భోజన పథకంలో పౌష్టికాహారం, ఇంగ్లిష్ మీడియం ప్రవేశం తదితర వాటితో ప్రభుత్వ పాఠశాలలను బలోపేతం చేస్తోంది. తాజాగా పూర్వ ప్రాథమిక విద్యను ఈ విద్యాసంవత్సరం నుంచే అందుబాటులోకి తెచ్చేందుకు సన్నద్ధమవుతోంది. వీరికి బోధనకుగాను కొంతమంది నిరుద్యోగ యువతను కాంట్రాక్ట్ ప్రతిపాదికన నియమించనున్నట్లు సమాచారం. ఇకపోతే, కరోనా మహమ్మారి కట్టడిలోకి వస్తే ఈ ఏడాది స్కూల్స్ ను సెప్టెంబర్ 5 నుండి ఓపెన్ చేయాలనీ ప్రభుత్వం ఆలోచిస్తుంది.