Begin typing your search above and press return to search.
వైసీపీ క్యాడర్ పై సీఎం జగన్ సంచలన నిర్ణయం
By: Tupaki Desk | 15 March 2022 4:32 PM GMTఇప్పటి వరకు పూచిక పుల్లలుగా మారిన వైసీపీ క్యాడర్ విషయంలో సీఎం జగన్ .. సంచలన నిర్ణయం తీసుకున్నారు. వైసీపీ ప్రజాప్రతినిధులు క్యాడర్‌కు చేరువ కావాలని పిలుపునిచ్చారు. గ్రామాల్లో తిరిగినప్పుడు క్యాడర్‌ను ప్రజలకు చేరువ చేయాలని పిలుపునిచ్చారు. ``క్యాడర్‌తో మీరు మమేకం చేయాలి.
మళ్లీ మూలాల్లోకి వెళ్లి బూత్ కమిటీల ఏర్పాటు చేయాలి. బూత్ కమిటీల్లో సగం మంది మహిళలు ఉండాలి. ఈ మూడు పనులు ఏకకాలంలో జరగాలి. ఆ తర్వాత వేరే సచివాలయానికి వెళ్లేముందు.. ఇక్కడ సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని కూడా చేపట్టాలి. పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమం, బూత్ కమిటీలు, ప్రతి ఇంటికీ వెళ్లి చేపట్టాలి`` అని పేర్కొన్నారు.
మే నుంచి క్షేత్రస్థాయికి!
మరోవైపు మే నెలలో సచివాలయాల సందర్శన కార్యక్రమాన్ని ప్రారంభించనున్నట్టు సీఎం జగన్ తెలిపారు. ఈ కార్యక్రమం ప్రారంభమయ్యే సరికి, జిల్లా, మండల,గ్రామ కమిటీలు ఏర్పాటు చేయాలన్నారు.
పర్యవేక్షణ కోసం మండల కమిటీ ఏర్పాటు చేస్తే.. గ్రామ కమిటీల పర్యవేక్షణ సులభం అవుతుందని తెలిపారు. జిల్లా కమిటీలు, ప్రాంతీయ సమన్వయకర్తలు ఎలాగూ యాక్టివేట్ అవుతారు కనుక.. ఏప్రిల్ నాటికి జిల్లా, మండల, గ్రామ కమిటీలు ఏర్పాటు కావాలన్నారు. ఇవన్నీ సక్రమంగా జరగడానికి పర్యవేక్షణ చేయాలని సూచించారు. ఈ కమిటీల ఏర్పాటులో రీజినల్ కో–ఆర్డినేటర్లు చురుగ్గా వ్యవహరిస్తారని తెలిపారు.
జిల్లాలకు రీజినల్ కోఆర్డినేటర్లు
రాష్ట్రంలో కొత్త జిల్లాలు 26 అయిన నేపధ్యంలో 3–4 జిల్లాలకు రీజినల్ కో–ఆర్డినేటర్లు ఉంటారని సీఎం జగన్ తెలిపారు. రమారమి 8 మంది వరకు పెరుగుతారని చెప్పారు. కొత్త జిల్లాలను పరిగణ లోకి తీసుకుని రీజినల్ కో–ఆర్డినేటర్లను నియమిస్తామన్నారు. జిల్లా కమిటీలు అన్ని పూర్తి చేసుకుని.. జులై 8న ప్లీనరీ నిర్వహిస్తామని సీఎం జగన్ వెల్లడించారు.
``ఇలా ఒకవైపున పార్టీ నిర్మాణం సాగుతోంది. మరోవైపున ఇప్పటికే 34 నెలలు పూర్తి చేసుకున్నాం. ఆ రోజు మీకు గుర్తుండే ఉంటుంది.. ఇదే మాదిరిగా శాసనసభాపక్ష సమావేశం పెట్టి రెండున్నర సంవత్సరాల తర్వాత మంత్రివర్గాన్ని పూర్తిగా పునర్‌వ్యవస్థీకరిస్తానని చెప్పాను. దీంట్లో భాగంగా ఈ కార్యక్రమానికి కూడా శ్రీకారం చుడతాం.`` అని జగన్ వెల్లడించారు.
పార్టీ అందరిదీ!
``పార్టీ అనేది మీరు, నేను అందరం కలిసి నిలబెట్టుకున్న పార్టీ అని గుర్తు ఉంచుకోవాలి. మంత్రివర్గంలో నుంచి తప్పిస్తున్నట్టగా ఎవ్వరూ భావించవద్దు. ఇప్పుడు ఎవరైతే మంత్రివర్గంలో ఉన్నారో వారికి పార్టీ బాధ్యతలు, జిల్లా అధ్యక్షపదవులు, రీజినల్ కో–ఆర్డినేటర్లు అవుతారు. వారికి పార్టీ బాధ్యతలు అప్పగిస్తున్నాం.
మంత్రులుగా పనిచేసినందున వారికి ప్రతిష్ట పెరిగింది. అంతేకాదు, వారికి పార్టీని నడిపించే శక్తి ఉంటుంది. ఎవరైతే మంత్రివర్గంలో నుంచి వెళ్లి పార్టీ బాధ్యతలు తీసుకుంటున్నారో వారందరికీ చెప్తున్నా..ఈ సిస్టం ఇలాగే కొనసాగుతుంది. మరలా మీరు గెలవండి, పార్టీని గెలిపించుకుని రండి.. మళ్లీ మీరు మంత్రులుకండి.`` అని సీఎం భరోసా కల్పించారు. ఈ విధానం ఇలాగే కొనసాగుతుందని, పార్టీ బాధ్యతలు అనేవి.. ఈ విధానంలో ఒక భాగమని వెల్లడించారు.
బాధ కాదు.. బాధ్యత
``ఇప్పుడు మంత్రులుగా వచ్చేవారు.. మళ్లీ పార్టీ బాధ్యతలు తీసుకోవాల్సి వస్తుంది. దాన్ని సంతోషంగా తీసుకోవాలి. పార్టీ గెలిచి, పార్టీ అధికారంలోకి రావడం కోసం ప్రతి ఒక్కరూ మనమంతా కలిసి..తలా ఒక చేయి వేస్తేనే మనం గెలవగలుగుతాం, మళ్లీ అధికారంలోకి రాగలుగుతాం. ఒకవైపు చేయాల్సిన మంచి కార్యక్రమాలు చేస్తూనే... మరోవైపు పార్టీ పరంగా మనం చేయాల్సిన కృషి ఉంది.
ఎరినైనా మంత్రి పదవులనుంచి తప్పిస్తున్నానంటే.. వారికి మరింత బాధ్యత అప్పగిస్తున్నామని అర్ధం. తప్పుదు అనుకున్న చోట, కొన్ని సామాజిక సమీకరణాల వల్ల కొన్ని కొన్ని మినహాయింపులు మంత్రివర్గ పునర్‌వ్యవస్థీకరణలో భాగంగా ఉంటాయి.`` అని సీఎం చెప్పారు.